Super Star Krishna : సూపర్ స్టార్ చెరగని నవ్వుకు ప్రతిరూపం
ఎల్లప్పుడూ ఆశావాద దృక్పథం
Super Star Krishna : సూపర్ స్టార్ ఘట్టమనేని శివరామకృష్ణ(Super Star Krishna) ఇక లేరు. ఇక రారు. వేలాది మంది అభిమానుల్ని కలిగిన అరుదైన నటుడు. ఎన్నో ప్రయోగాలు మరెన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఈ సూపర్ స్టార్ కే దక్కింది. ఒక్కో నటుడిది ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం వెరీ వెరీ స్పెషల్.
ఆయన స్నేహశీలి. మృధు స్వభావం కలిగిన వ్యక్తి. ఎవరికీ చెరుపు చేయాలన్న తలంపు దరి దాపుల్లోకి రానివ్వని నటుడు. రాగ ద్వేషాలకు అతీతంగా ఉండడం మామూలు విషయం కాదు. ఓ సామాన్యమైన కుటుంబం నుంచి సినిమా రంగం మీద ప్రేమతో వచ్చి అంచెలంచెలుగా పరిశ్రమగా ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణ.
బలమైన ముద్ర కలిగిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను తట్టుకుని నిలబడ్డారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. రాజకీయ నాయకుడిగా కూడా సేవలు అందించారు. ఏ సాయం కావాలన్నా స్పందించే గుణం కలిగిన మారాజు సూపర్ స్టార్ కృష్ణ. పద్మాలయ స్టూడియో ద్వారా ఎందరికో నీడనిచ్చారు.
బతుకునిచ్చిన ఘనత కూడా కృష్ణదే. తన 57 ఏళ్ల సినీ ప్రస్థానంలో 350కి పైగా సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. ఇటు తెలుగులో అటు బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలను తీసిన ఘనత కూడా సూపర్ స్టార్ దే(Super Star Krishna).
ఇక ప్రత్యేకంగా చెప్పు కోవాల్సింది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ పెదవులపై చెరగని నవ్వు. అది ఎప్పటికీ ఎల్లప్పటికీ నిలిలచే ఉంటుంది. తెలుగు సినిమా ఉన్నంత దాకా కృష్ణ ఉంటారు. మనల్ని పలకరిస్తూనే ఉంటారు.
Also Read : స్నేహపాత్రుడు అభిమానధనుడు