Actor Krishna Politics : పాలిటిక్స్ లోనూ సూప‌ర్ స్టార్ మార్క్

ఎన్టీఆర్ కు వ్య‌తిరేకంగా యుద్దం

Actor Krishna Politics : సూప‌ర్ స్టార్ శ‌కం ముగిసింది. ఇవాళ ఆయ‌న ఈ లోకం నుంచి నిష్క్ర‌మించారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా పేరొందిన కృష్ణ రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన మార్క్ చూపించారు. ఎక్క‌డా త‌ల వంచ‌ని మ‌న‌స్త‌త్వం అత‌డికి మ‌రింత ఆద‌ర‌ణ ల‌భించేలా చేసింది. ఓ వైపు ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నం.

మ‌రో వైపు కృష్ణ త‌న వంతుగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశారు. కానీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. త‌ల వంచ‌నూ లేదు. చివ‌రి దాకా ఏ పార్టీని కూడా మార‌లేదు. తాను న‌మ్మిన సిద్దాంతానికి క‌ట్టుబ‌డి ఉన్నారు. ఎక్క‌డ కాలు మోపినా అందులో విజ‌యం సాధించాల‌న్న త‌ప‌న క‌లిగి ఉన్నారు సూపర్ స్టార్.

ఆయ‌న‌కు అసాధ్యుడు అన్న పేరు కూడా వ‌చ్చింది. ఒక్క‌సారి దిగితే ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా వెన‌క్కి తగ్గేవారు కాదు సూప‌ర్ స్టార్. ఓ వైపు న‌టుడిగా ఉంటూనే మ‌రో వైపు పాలిటిక్స్(Actor Krishna Politics)  లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆనాడు 1972లో జ‌రిగిన జై ఆంధ్ర ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇచ్చారు .

1982లో విడుద‌లైన కృష్ణ తీసిన ఈనాడు ప్ర‌భంజనం సృష్టించింది. ఆ మూవీ ఎన్టీఆర్ టీడీపికి స‌పోర్ట్ గా నిలిచింది. కానీ ఆ త‌ర్వాత ఎన్టీఆర్, కృష్ణ‌కు విభేదాలు వ‌చ్చాయి. 1984లో ఎన్టీఆర్ స‌ర్కార్ కూలిపోతే నాదెండ్ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు కృష్ణ‌. ఇందిరా గాంధీ అంత్య‌క్రియ‌ల‌కు కృష్ణ హాజ‌ర‌య్యారు.

త‌న అభిమానాన్ని చాటుకున్నారు. రాజీవ్ ను క‌లిశారు. అదే ఏడాదిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కు వ్య‌తిరేకంగా మండ‌లాధీశుడు, సాహ‌స‌మే నా ఊపిరి, లాంటి చిత్రాలు తీశారు. నా పిలుపే ప్ర‌భంజ‌నం అంటూ తీసిన సినిమా ఆద‌ర‌ణ పొందింది. 1989లో ఏలూరులో ఎంపీగా గెలుపొందారు.

1991లో ఓడి పోయారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.

Also Read : సూప‌ర్ స్టార్ చెర‌గ‌ని న‌వ్వుకు ప్ర‌తిరూపం

Leave A Reply

Your Email Id will not be published!