Mumbai Indians Released : ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ షాక్
13 మంది ఆటగాళ్ల విడుదల
Mumbai Indians Released : వచ్చే ఏడాది 2023లో ఐపీఎల్ జరగనుంది. డిసెంబర్ 23 వేదికగా కేరళలోని కొచ్చిలో మినీ వేలం పాట జరగనుంది. నవంబర్ 15 లోపు ఆయా ఫ్రాంచైజీలు తమ జట్టుకు సంబంధించిన ఆటగాళ్లను ఎవరిని ఉంచుకోవాలో, ఎవరిని రిలీజ్ చేయాలో తెలియ చేయాల్సి ఉంటుంది.
ఈ మేరకు ఇప్పటి వరకు 10 ఫ్రాంచైజీలు ప్రముఖ ఆటగాళ్లను వదులుకున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్ ను రిలీజ్ చేసింది. ఇదిలా ఉండగా ఏకంగా ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను రిలీజ్(Mumbai Indians Released) చేసింది. మరికొన్ని జట్లు ఒప్పందం ద్వారా కొందరిని ఇతర జట్లకు అమ్మడం విశేషం.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తాము వదులుకున్న ఆటగాళ్ల లిస్టు విడుదల చేసింది. కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ సీజన్ లో ఇంత పెద్ద మొత్తంలో ఆటగాళ్లను వదులు కోవడం విస్తు పోయేలా చేసింది. వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 20.55 కోట్లు ఖర్చు చేయనుంది.
ఇక ముంబై ఇండియన్స్ వదులుకున్న వారిలో కీరన్ పోలార్డ్ ఉన్నాడు. ఇదిలా ఉండగా పోలార్డ్ విండీస్ బ్యాటింగ్ కోచ్ గా ఎంపికయ్యాడు. ఇక పోలార్డ్ తో పాటు అన్ మోల్ , ఆర్యన్ జుయల్, థంపి, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్ , రాహుల్ బుద్ది, సంజయ్ యాదవ్ , రిలే మెరిడిత్ , టైమల్ మిల్స్ , డానియల్ సామ్స్ , ఫాబియన్ అల్లెన్ , జయదేవ్ ఉనాద్కత్ ఉన్నారు.
గత కొంత కాలంగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పేలవమైన ప్రదర్శన చేస్తోంది. అందుకే మేనేజ్ మెంట్ కీలక మార్పులు చేసింది.
Also Read : ఆటగాళ్లకు షాక్ ఫ్రాంచైజీల విడుదల