NATO Alert : పోలాండ్ సరిహద్దుల్లో రాకెట్ దాడి
ఇద్దరు దుర్మరణం నాటో ఆగ్రహం
NATO Alert : రష్యా తన తీరును మార్చు కోవడం లేదు. యావత్ ప్రపంచం నెత్తీ నోరు మొత్తుకున్నా యుద్దాన్ని ఆపడం లేదు. ఈ తరుణంలో రష్యా ప్రయోగించిందని అనుమానం వ్యక్తం చేస్తున్న క్షిపణి ప్రయోగం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్ తీవ్ర భయాందోళనల మధ్య పోలాండ్ లో క్షిపణి కూలడంతో ఇద్దరు దుర్మరణం చెందినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.
ఇదిలా ఉండగా ఇండోనేషియాలోని బాలిలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. మొత్తం 19 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే భారత్ తో సహా పలు దేశాలు యుద్దాన్ని ఆపాలని కోరుతున్నాయి. ఈ తరుణంలో పోలండ్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దీని వెనుక రష్యా ఉందన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
రష్యాకు నాటో హెచ్చరికలు(NATO Alert) జారీ చేసింది. పోలండ్ పై దాడితో బాలిలో అత్యవసర సమావేశం నిర్వహించారు. పోలాండ్ లోని ప్రిజెవోడో అనే గ్రామం వద్ద రాకెట్ పడి పోయినట్లు ఆ దేశం ప్రకటించింది. ఇది రష్యా నిర్వాకమేనంటోంది. ఈ విషయాన్ని తీవ్రంగా తప్పు పట్టింది పోలీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ.
ఈ క్షిపణి ప్రయోగంతో ఉక్రెయిన్ వివాదం మరింత తీవ్రతరం అవుతుందనే భయాలను రేకెత్తించింది. ఉక్రెయిన్ సరిహద్దుకు 6 కిలోమీటర్ల దూరంలో తూర్పు పోలాండ్ లో ఉంది దాడికి గురైన గ్రామం. క్షిపణిని ఎవరు ప్రయోగించారనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని పోలాండ్ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ దుడా అన్నారు.
Also Read : 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తా – ట్రంప్