IPL 2023 SRH TOP : స‌న్ రైజ‌ర్స్ ద‌గ్గ‌ర రూ. 42.25 కోట్లు

అత్యల్పంగా కోల్ క‌తా వ‌ద్ద రూ. 7.05 కోట్లు

IPL 2023 SRH TOP : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఈసారి కూడా 10 జ‌ట్లు పాల్గొన‌బోతున్నాయి. ఇక రిటైన్ చేసుకోవ‌డం, రిలీజ్ చేయ‌డం కూడా జ‌రిగి పోయింది. న‌వంబ‌ర్ 15న డెడ్ లైన్ కావ‌డంతో అన్ని జ‌ట్లు త‌మ త‌మ ఆట‌గాళ్ల‌తో కూడిన జాబితాను భార‌త క్రికెట్ నియంత్ర‌ణ బోర్డు (బీసీసీఐ)కు అంద‌జేశాయి.

ఈసారి అత్య‌ధికంగా ఆట‌గాళ్ల‌ను వ‌దులుకుంది మాత్రం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. ఆ త‌ర్వాతి స్థానాల‌ను ముంబై ఇండియ‌న్స్ , స‌న్ రైజ‌ర్స్, పంజాబ్ కింగ్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ ఉన్నాయి. గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిలిచాయి.

ఇక డ‌బ్బుల ప‌రంగా చూస్తే ఏ జ‌ట్టు (ఫ్రాంచైజ్ ) వ‌ద్ద ఎంత ఉన్నాయ‌ని లెక్కిస్తే టాప్ లో నిలిచింది స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్(IPL 2023 SRH TOP) . ఆ ఫ్రాంచైజీ వ‌ద్ద రూ. 42.25 కోట్లు ఉన్నాయి. సెకండ్ ప్లేస్ లో పంజాబ్ కింగ్స్ ద‌గ్గ‌ర రూ. 32.2 కోట్లు మిగిలాయి. ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌ద్ద రూ. 23.35 కోట్లు, ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజ్ వ‌ద్ద రూ. 20.55 కోట్లు ఉన్నాయి.

చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ద్ద రూ. 20.45 కోట్లు ఉండ‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో రూ. 19.45 కోట్లు మిగిలిల ఉన్నాయి. మ‌రో వైపు గుజ‌రాత్ టైటాన్స్ వ‌ద్ద రూ. 19.25 కోట్లు ఉండ‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ద్ద రూ. 13.2 కోట్లు, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ వ‌ద్ద కేవ‌లం రూ. 8.75 కోట్లు మాత్ర‌మే ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఐపీఎల్ కోసం డిసెంబ‌ర్ 23న కేర‌ళ లోని కొచ్చిలో మినీ వేలం పాట నిర్వ‌హించ‌నుంది బీసీసీఐ – ఐపీఎల్ మేనేజ్ మెంట్.

Also Read : అంబ‌టి..జ‌డేజాకు క‌లిసొచ్చిన అదృష్టం

Leave A Reply

Your Email Id will not be published!