Hemant Soren : బీజేపీ కుట్రలు చెల్లవు ఆటలు సాగవు – సోరేన్
కేంద్ర సర్కార్ పై..మోదీ..షాపై సీఎం సీరియస్
Hemant Soren : జార్ఖండ్ ముక్తీ మోర్చా చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్(Hemant Soren) నిప్పులు చెరిగారు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీజీపీయేతర ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా త్రయం జార్ఖండ్ లో జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ బీజేపీ కుట్రలు, ఆటలు తన ముందు సాగవని హెచ్చరించారు.
అవసరమైతే ప్రత్యక్ష యుద్దానికి సిద్దం అవుతామే తప్పా రాజీ పడే ప్రసక్తి లేదని సీఎం స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. కేంద్రంలో పవర్ ఉంది కదా అని కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకున్నారంటూ మండిపడ్డారు హేమంత్ సోరేన్(Hemant Soren).
రాంచీలో సీఎం మీడియాతో మాట్లాడారు. వాళ్ల ప్లాన్ ఒక్కటే రాష్ట్రంలో అశాంతిని, అల్లర్లను సృష్టించి ప్రభుత్వాన్ని దొడ్డి దారిన కూల దోయాలని చూస్తున్నారని ఆరోపించారు సీఎం.
ఇందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే సీబీఐ, ఈడీలను వాడుకుంటోందని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్ లీజుకు సంబంధించిన స్కాంలో నోటీసులు జారీ చేసింది సీఎంకు ఈడీ. 16న హాజరు కావాలని ఈడీ సమన్లలో పేర్కొంది. తాను హాజరు కానంటూ స్పష్టం చేశారు హేమంత్ సోరేన్.
Also Read : పెన్ మేకర్ రొటోమాక్ రూ. 750 కోట్ల స్కాం