IND vs NZ 1st T20 Match : కీవీస్ భారత్ టి20 మ్యాచ్ వర్షార్పణం
రద్దు చేసినట్లు ప్రకటించిన అంపైర్లు
IND vs NZ 1st T20 Match : భారత న్యూజిలాండ్ మధ్య శుక్రవారం న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ లో జరగాల్సిన మొదటి టి20 మ్యాచ్ పూర్తిగా రద్దయింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఎలాంటి ఆట ప్రారంభం కాకుండానే ఆగి పోయింది. పూర్తిగా మైదానంలో ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది.
కనీసం ఒక్క బంతి వేయకుండానే మ్యాచ్ నిలిపి వేసినట్లు ప్రకటించారు అంపైర్లు. దీంతో మూడు మ్యాచ్ ల టి20 సీరీస్ లో ఒక మ్యాచ్ పూర్తిగా ఆగి పోవడంతో భారత క్రికెటర్లు(IND vs NZ 1st T20 Match) తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి.
కీవీస్ పాకిస్తాన్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలు కాగా భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ తరుణంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవించంద్రన్ అశ్విన్ ను పక్కన పెట్టారు విశ్రాంతి పేరుతో. ఈ తరుణంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ పగ్గాలు అప్పగించింది.
ఈ జట్టులో పూర్తిగా యువ ఆటగాళ్లు ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో హైదరాబాద్ మాజీ క్రికెటర్ , భారత క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ను నియమించింది. ఇదిలా ఉండగా కీవీస్ టూర్ లో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ ఆడనుంది. టి20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉండగా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్నారు.
Also Read : సన్ రైజర్స్ దగ్గర రూ. 42.25 కోట్లు