Rishabh Pant BCCI : రిషబ్ పంత్ పై ఎందుకంత ప్రేమ
ఆడక పోయినా బీసీసీఐ ఎంపిక
Rishabh Pant BCCI : ఎక్కడైనా ఏ ఆట లోనైనా జట్టును ఎంపిక చేసే సమయంలో అద్భుతంగా ఆడిన వాళ్లను ఎంపిక చేస్తారు. కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) లో మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతూ వస్తోంది సెలెక్షన్ కార్యక్రమం.
గత కొంత కాలంగా కేరళ స్టార్ బ్యాటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విషయంలో సెలెక్షన్ కమిటీ దారుణంగా వ్యవహరిస్తూ వచ్చింది. అద్భుతంగా ఆడినా పక్కన పెడుతూ వచ్చింది.
టి20 ఫార్మాట్ లో ఈ ఏడాది సంజూ శాంసన్ 179 పరుగులు చేశాడు. ప్రతి మ్యాచ్ లో నిరాశ పరుస్తూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఛాన్స్ ఇస్తూ వచ్చింది బీసీసీఐ. ఇప్పటి వరకు 62 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్ గా ఉన్న ముంబైకి చెందిన ఇషాన్ కిషన్ 84 రన్స్ చేస్తే శ్రేయస్ అయ్యర్ 112 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు.
ఇక దీపక్ హూడా కేవలం 57 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఈ అయిదుగురు ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసింది ఒకే ఒక్కడు సంజూ శాంసన్. రన్స్ , పర్ ఫార్మెన్స్ పరంగా చూస్తే శాంసన్ కు ఛాన్స్ తప్పనిసరిగా దక్కాల్సి ఉంటుంది.
కానీ సీన్ రివర్స్ . కేరళ స్టార్ తప్ప రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ , దీపక్ హూడా, అయ్యర్ లను ఆడించారు. దీనికి సవాలక్ష కారణాలు చూపింది బీసీసీఐ. మొత్తంగా రిషబ్ పంత్(Rishabh Pant BCCI) ఆడక పోయినా ఎందుకు ఎంపిక చేస్తున్నారనే దానికి క్లారిటీ ఇవ్వలేక పోయింది.
చివరకు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా దాటవేసే సమాధానం ఇచ్చాడు. మొత్తంగా పంత్ పై ఎందుకు ఇంతటి ప్రేమ అనేది తేలాల్సి ఉంది.
Also Read : శాంసన్ కు ఇంకా టైం ఉంది – పాండ్యా