Swati Maliwal : జామా మసీదు నిషేధంపై స్వాతి మలివాల్ ఫైర్
నోటీసులు జారీ చేసిన చైర్ పర్సన్ స్వాతి మలివాల్
Swati Maliwal : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్(Swati Maliwal) సీరియస్ అయ్యారు. జామా మసీదు లోకి తోడు లేకుండా యువతులు, మహిళలు వస్తే అనుమతించ బోమంటూ నోటీసు బోర్డులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మసీదు వద్ద పోస్టర్ ను కూడా అంటించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.
దీనిని సీరియస్ గా తీసుకుంది ఢిల్లీ మహిళా కమిషన్. ఈ మేరకు జామా మసీదు కమిటీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ సూత్రాలకు పూర్తిగా విరుద్దమని పేర్కొంది. అంతే కాదు సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల పట్ల, బాలికలు, యువతుల పట్ల వివక్ష చూపడం నేరమని స్పష్టం చేసింది.
తోడు లేకుండా వచ్చే మహిళలను అనుమతించక పోవడం దారుణమని పేర్కొంది. ఈ మేరకు జామా మసీదు జారీ చేసిన ఉత్తర్వులపై చైర్ పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీద్ గేట్ వద్ద పోస్టర్ ను ఉంచారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్దమని ఆమె పేర్కొన్నారు.
దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, సభ్య సమాజం సిగ్గుపడేలా ఈ నిర్ణయం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్వాతి మలివాల్ తీసుకున్న చర్యలు దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తుండగా మరో వైపు ఛాందసవాదులు ఆమెను తప్పు పడుతున్నారు.
చైర్ పర్సన్ ఢిల్లీలో లేని సమయంలో ఆమె ఇంటి ముందు ఉన్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు కూడా దాడులకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
Also Read : విమానాలలో సెక్యూరిటీ పెంపుపై ఫోకస్