Belgium Riots : బెల్టియం ఓట‌మితో బ్ర‌స్సెల్స్ లో అల్ల‌ర్లు

అదుపులోకి తీసుకున్న పోలీసులు

Belgium Riots : ప్ర‌పంచంలో ఫుట్ బాల్ కు ఉన్నంత ఫీవ‌ర్ ఇంకే ఆట‌కు లేదంటే న‌మ్మ‌లేం. ఒక్కోసారి దాడులు కూడా కొన‌సాగుతాయి. తాజాగా ఖ‌తార్ వేదిక‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022 జ‌రుగుతోంది. లీగ్ లో భాగంగా మొరాకో చేతిలో బెల్జియం జ‌ట్టు ఓట‌మి పాలైంది.

దీంతో త‌మ జ‌ట్టు ఓట‌మిని త‌ట్టుకోలేని అభిమానులు బ్ర‌స్సెల్స్ లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. అల్ల‌ర్లకు పాల్ప‌డ్డారు. దీంతో ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. బెల్జియం రాజ‌ధాని అంత‌టా అల్ల‌ర్లు(Belgium Riots)  కొన‌సాగుతున్నాయి. డ‌జ‌న్ల కొద్దీ సాక‌ర్ అభిమానులు వీధుల్లోకి వ‌చ్చారు.

త‌మ జ‌ట్టు ఓట‌మిని జీర్ణించు కోలేక పోతున్నామ‌ని వాపోయారు మ‌రికొంద‌రు. వాట‌ర్ కెనాన్స్ , టియ‌ర్ గ్యాస్ ను కూడా ప్ర‌యోగించాల్సి వ‌చ్చింది పోలీసులు. అయినా ఇంకా అల్ల‌ర్లు అదుపులోకి రాక పోవ‌డంతో అద‌న‌పు భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఆందోళ‌న చేప‌ట్టిన చాలా మందిని అరెస్ట్ చేశారు.

మొరాకో విక్ట‌రీని జీర్ణించు కోలేని ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. బ్ర‌స్సెల్స్ లో అల్ల‌క‌ల్లోం సృష్టించారు. ఇదిలా ఉండ‌గా తాము శాంతియుతంగా నిర‌స‌న తెలిపామ‌ని కానీ పోలీసులే ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నారంటూ బెల్జియం సాక‌ర్ అభిమానులు ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం అభిమానుల‌ను త‌ప్పు ప‌ట్టారు.

ఫ్యాన్స్ రూపంలో అల్ల‌ర్లు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నం చేశార‌ని అందుకే తాము టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితిని అదుపు త‌ప్ప‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా బెల్జియం(Belgium Riots)  జ‌ట్టు త‌మ దేశానికి వ‌చ్చినా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొనే ప్ర‌మాదం పొంచి ఉంది.

Also Read : ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో ‘శాంస‌న్’ ఫీవ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!