Brazil VS Switzerland : నాకౌట్ కు దూసుకెళ్లిన బ్రెజిల్
స్విట్జర్లాండ్ పై ఘన విజయం
Brazil VS Switzerland : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఇంకా ఫైట్ చేస్తుండగా టైటిల్ ఫేవరేట్ జట్టుగా పేరొందిన బ్రెజిల్ మెగా టోర్నీలో నాకౌట్ కు చేరుకుంది. లీగ్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో సెర్పియాపై గెలుపొందిన బ్రెజిల్ తదుపరి మ్యాచ్ లో స్విట్జర్లాండ్(Brazil VS Switzerland) పై 1-0 తేడాతో విజయం సాధించింది.
ఇక మ్యాచ్ లో భాగంగా 83వ నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు కాస్మైరో కళ్లు చెదిరేలా సూపర్ గోల్ చేశాడు. దీంతో బ్రెజిల్ కు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరో వైపు స్విట్జర్లాండ్ ఆటగాళ్లు బ్రెజిల్ కు చుక్కలు చూపించారు. ఆట ముగిసేంత వరకు దాడి చేస్తూనే వచ్చారు. ఒకవేళ కాస్మైరో గనుక గోల్ చేయక పోయి ఉంటే ఈ మ్యాచ్ డ్రా అయ్యేది.
ఫస్ట్ హాఫ్ లో నిరాశే మిగిలింది. సెకండ్ హాఫ్ లో మాత్రం బ్రెజిల్ ఊహించని రీతిలో అటాకింగ్ మొదలు పెట్టింది. దీంతో స్విస్ ప్లేయర్లు కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు. మరో వైపు బ్రెజిల్ గోల్ సాధించడంతో ఊపిరి పీల్చుకున్నారు. మ్యాచ్ మొత్తంలో తొమ్మిదిసార్లు గోల్ చేసేందుకు బ్రెజిల్ ట్రై చేసింది.
కానీ ఒకే ఒక్క గోల్ ను సాధించింది. ఇక ప్రత్యర్థి స్విట్జర్లాండ్ జట్టు నాలుగు సార్లు ప్రయత్నం చేసింది గోల్ చేసేందుకు కానీ ఆశించిన రీతిలో రాణించ లేక పోయింది. మొత్తంగా ఫీఫా సాకర్ ఫీవర్ ను రోజు రోజుకు పెంచుతోంది.
ఇక టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ ల్లో జర్మనీ, స్పెయిన్ మధ్య కామెరూన్ , సెర్బియా మధ్య మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఘనా కొరియాపై 3-2 తేడాతో గెలుపొందింది.
Also Read : రొనాల్డోకు సౌదీ ఫుట్ బాల్ క్లప్ బంపర్ ఆఫర్