Gautam Gambhir : కెప్టెన్సీలో పాండ్యా కంటే షా బెట‌ర్

గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

Gautam Gambhir : ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టులో టి20 జ‌ట్టు కెప్టెన్సీ మార్పుపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అటు సోష‌ల్ మీడియాలో ఇటు క్రీడా రంగంలో ఎవ‌రు ఉండాల‌నే దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుస‌రిస్తున్న సెలెక్ష‌న్ విధానంపై నిప్పులు చెరుగుతున్నారు ఫ్యాన్స్.

ప్ర‌ధానంగా ఆట‌గాళ్లు రాణించినా ప‌ట్టించుకోక పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌గా కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజూ శాంస‌న్ రాణించినా ప‌క్క‌న పెట్ట‌డంపై మండిప‌డుతున్నారు. మరో వైపు వ‌రుస‌గా మ్యాచ్ లు ఫెయిల్ అవుతూ వ‌స్తున్నా రిష‌బ్ పంత్ ను ఎందుకు ఎంపిక చేస్తున్నార‌నే దానికి స‌మాధానం లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సెలెక్ష‌న్ క‌మిటీని ర‌ద్దు చేసింది బీసీసీఐ. కొత్త వారి ఎంపిక కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. న‌వంబ‌ర్ 28తో పూర్త‌యింది. ఈ త‌రుణంలో భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ప్ర‌స్తుతం టి20 జ‌ట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని కానీ త‌న దృష్టిలో అగ్రెస్సివ్ కెప్టెన్ గా పృథ్వీ షా స‌రిగ్గా స‌రి పోతాడంటూ కితాబు ఇచ్చారు. ప్ర‌స్తుతం గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే రిష‌బ్ పంత్ వ‌ర్సెస్ సంజూ శాంస‌న్ అంశం సోష‌ల్ మీడియాలో టాప్ లో ట్రెడింగ్ లో ఉంది.

అయితే బీసీసీఐ టి20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకు అప్ప‌గించాల‌ని, వ‌న్డే, టెస్టు జ‌ట్ల‌కు రోహిత్ శ‌ర్మ‌ను కంటిన్యూ చేయాల‌ని అనుకుంటోంది. మ‌రి హెడ్ కోచ్ ను కూడా మార్చేస్తారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ఎంపికపై ఉత్కంఠ‌

Leave A Reply

Your Email Id will not be published!