Sanju Samson 3rd ODI : మూడో వ‌న్డేలో నైనా శాంస‌న్ కు ఛాన్స్ ద‌క్కేనా

కేర‌ళ స్టార్ కెరీర్ తో ఆడుకుంటున్న బీసీసీఐ

Sanju Samson 3rd ODI : న్యూజిలాండ్ టూర్ లో భాగంగా మూడో వ‌న్డే న‌వంబ‌ర్ 30న బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే 1-0 తేడాతో పాండ్యా సార‌థ్యంలోని టీమిండియా సీరీస్ కైవ‌సం చేసుకుంది. అనంత‌రం శిఖ‌ర్ ధావ‌న్ నాయ‌క‌త్వంలోని వ‌న్డే జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వ‌న్డే మ్యాచ్ లు ఆడింది.

మొద‌టి మ్యాచ్ లో భారీగా స్కోర్ చేసినా కీవీస్ అల‌వోక‌గా ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంత‌కు ముందు భార‌త జ‌ట్టు 7 వికెట్లు కోల్పోయి 306 ప‌రుగులు చేసింది. తొలి వ‌న్డేలో ఇద్ద‌రు వికెట్ కీప‌ర్ల‌ను ఆడించింది మేనేజ్ మెంట్. రిష‌బ్ పంత్ ఫెయిల్ అయ్యాడు.

కానీ సంజూ శాంస‌న్ 38 బంతులు ఎదుర్కొని 36 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో రెండో వ‌న్డేలో శాంస‌న్ ను తీసుకుంటార‌ని అంతా భావించారు. కానీ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ , తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మ‌ణ్ లు మ‌రోసారి పక్క‌న పెట్టేశారు సంజూ శాంస‌న్ ను.

ప్ర‌పంచంలో ఏ క్రీడా సంస్థ అయినా లేదా ఏ సెలెక్ష‌న్ క‌మిటీ అయినా అద్భుతంగా ఆడుతున్న వాళ్ల‌ను జ‌ట్టులోకి తీసుకుంటారు. కానీ భార‌త్ లో మాత్రం ఇందుకు డిఫ‌రెంట్ గా ఉంది. అటు స్ట్రైక్ రేట్ లోను, ఇటు ప‌రుగులు చేయ‌డంలోనూ దుమ్ము రేపుతున్నాడు సంజూ శాంస‌న్(Sanju Samson 3rd ODI). కానీ కావాల‌ని రెండో వ‌న్డేలో ప‌క్క‌న పెట్టేశారు.

తిరిగి రిష‌బ్ పంత్ కు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక రెండో వ‌న్డే వ‌ర్షార్ఫ‌ణం కావ‌డంతో కేవ‌లం ఒకే ఒక్క వ‌న్డే మ్యాచ్ ఆడాల్సి ఉంది. మ‌రి శాంస‌న్ కు ఛాన్స్ ఇస్తారా లేక రిష‌బ్ పంత్ ను కొన‌సాగిస్తారా చూడాలి.

Also Read : కెప్టెన్సీలో పాండ్యా కంటే షా బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!