MLC Kavitha Liquor Scam : అమ్మో క‌విత మామూలు లేదుగా

9 నెల‌ల్లో 10 ఫోన్లు మార్చేసింది

MLC Kavitha Liquor Scam : నిన్న‌టి దాకా చిలుక ప‌లుకులు ప‌లికింది. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పింది. ఆపై త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ను చెప్పుతో కొడ‌తాన‌ని అంది.

అంతేనా ఎక్క‌డ నిల‌బ‌డినా వెంట ప‌డ‌తాన‌ని, ఓడిస్తానంటూ స‌వాల్ చేసింది సీఎం కేసీఆర్ త‌న‌యురాలు, ఎమ్మెల్సీ క‌విత. ఎప్పుడైతే ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారో ఆనాటి నుంచి ఢిల్లీలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ స‌ర్కార్ కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆధ్వ‌ర్యంలో అమ‌లు చేసిన మ‌ద్యం పాల‌సీపై త‌న‌కు అనుమానాలు ఉన్నాయంటూ విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ మేర‌కు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. ఏకంగా సిసోడియాతో పాటు 15 మందిపై ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసింది. ఆ త‌ర్వాత తీగ లాగితే డొంకంతా క‌దిలింది.

ఈ లిక్క‌ర్ స్కాం లింకులు దేశంలోని 40 ప్రాంతాల్లో దొరికాయి. కానీ ఊహించ‌ని రీతిలో కోట్లాది రూపాయ‌లు చేతులు మారింది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ‌లోనే ఉండ‌డం విస్తు పోయేలా చేసింది.

ఆపై సీన్ క‌ట్ చేస్తే బ‌డా నేత‌ల బండారం బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంటతో పాటు ఎంపీ విజ‌య సాయి రెడ్డి అల్లుడి సోద‌రుడు,

అర‌బిందో ఫార్మా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రా రెడ్డి, భార్య క‌నికా రెడ్డి, ప్ర‌ణ‌య్ రెడ్డి అడ్డంగా బుక్క‌య్యారు.

ఆపై తెలంగాణ‌లో ఈడీ దూకుడు పెంచింది. క‌ల్వ‌కుంట్ల క‌విత(MLC Kavitha) ముఖ్య అనుచ‌రుడిగా పేరొందిన బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావు, సీఏ బుచ్చిబాబుల‌ను అదుపులోకి తీసుకుంది. 

ఢిల్లీలో సిసోడియాకు సంబంధించిన వారిని టార్గెట్ చేసింది. వీరంద‌రిని అరెస్ట్ చేయ‌డంలో క‌విత‌క్క అస‌లు స్వ‌రూపం బ‌య‌ట పెట్టింది ఈడీ.

బ‌తుక‌మ్మ‌గా పేరొందిన క‌విత‌మ్మ ఏకంగా లిక్క‌ర్ రాణిగా మార‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ప‌దే ప‌దే తన‌కు ఏ పాపం తెలియ‌ద‌ని

బుకాయిస్తూ వ‌చ్చిన క‌ల్వ‌కుంట్ల క‌విత ఇప్పుడు జైలు ఊచ‌లు లెక్క‌పెట్టే ప‌రిస్థితికి వ‌చ్చింది.

ప‌క్కా ఆధారాల‌తో స‌హా ఈడీ బ‌య‌ట పెట్టింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఆమె పేరు ప్ర‌ధానంగా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. బుధ‌వారం అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈ విష‌యాన్ని పేర్కొంది.

 10 వేల పేజీల నివేదిక క‌ల‌క‌లం రేపింది. మొత్తం 36 మంది నిందితులు ఉన్నార‌ని అంతా క‌లిపి 170 ఫోన్లు వినియోగించారంటూ వెల్ల‌డించింది. కాగా త‌మ‌కు కేవ‌లం 17 ఫోన్లు మాత్ర‌మే దొరికాయ‌ని తెలిపింది ఈడీ.

అమిత్ అరోరా వాడిన 11 ఫోన్లు, ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) వాడిన 10 ఫోన్ల‌ను ఆధారాలు దొర‌క‌కుండా ధ్వంసం చేశార‌ని ఆరోపించింది. 2021

డిసెంబ‌ర్ నుంచి 2022 ఆగ‌స్టు వ‌ర‌కు అంటే 9 నెలల్లో క‌విత‌క్క 10 ఫోన్లు మార్చార‌ని తెలిపింది.

అమిత్ అరోరా 10 సార్లు క‌విత‌కు ఫోన్ చేశార‌ని, మొత్తం వాడిన ఫోన్ల విలువ రూ. 1. 38 కోట్లు ఉంటుంద‌ని ఈడీ అంచ‌నా వేసింది.

Also Read : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం సౌత్ గ్రూప్ నిర్వాకం

Leave A Reply

Your Email Id will not be published!