Women Bench : సీజేఐ సంచలన నిర్ణయం మహిళా ధర్మాసనం
భారత దేశ చరిత్రలో ఇది మూడవసారి
Women Bench : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో(Women Bench) కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భారత దేశ చరిత్రలోనే ఇది మూడోసారి కావడం విశేషం.
కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా ధర్మాసనంలో జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బేల ఎం. త్రివేది సభ్యులుగా ఉంటారు. కేవలం మహిళా న్యాయ మూర్తులను ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించి ఈ బెంచ్ కు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు భవనంలోని రూము నెంబర్ 11ను కేటాయించారు.
ఈ ప్రత్యేక ధర్మాసనం పది బదిలీ పిటిషన్లు, పది బెయిల్ కేసులు, 9 సివిల్ కేసులు, మూడు క్రిమినల్ కేసుల్ని విచారించనుందని స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ ధనంజయ ఎస్ చంద్రచూడ్. మొదటి మహిళా బెంచ్(Women Bench) (ధర్మాసనం) 2013 సంవత్సరంలో న్యాయమూర్తులు జ్ఞాన్ సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్ ఉన్నారు.
కేసుల్ని విచారించి తీర్పులు వెలువరించారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు చరిత్రలో కేవలం 11 మమంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన తొలి మహిళా న్యాయమూర్తి. 1989లో చోటు చేసుకుంది.
కాగా జస్టిస్ బీవీ నాయకత్వంలో జస్టిస్ సుజాతా మనోహర్ , జస్టిస్ రుమా పాల్ , జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ , ఆర్. భానుమతి, ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ, జస్టిస్ హిమా కోహ్లీ, బీవీ నాగరత్న, బేలా త్రివేది ఉన్నారు.
Also Read : సునంద కేసులో శశి థరూర్ కు షాక్