Sanju Samson : పంత్ కు గాయం శాంస‌న్ కు అవ‌కాశం

బంగ్లాదేశ్ టూర్ కు ఎంపిక చేసే ఛాన్స్

Sanju Samson : దేశ వ్యాప్తంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుస‌రిస్తున్న విధానం ప‌ట్ల పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్ర‌ధానంగా కేర‌ళ స్టార్ బ్యాట‌ర్ గా పేరొందిన సంజూ శాంస‌న్ ను ప‌క్క‌న పెట్ట‌డం, ఎలాంటి ప‌ర్ ఫార్మెన్స్ లేక పోయినా జ‌ట్టులో కంటిన్యూగా రిష‌బ్ పంత్ ను చేర్చ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

వ‌రుస‌గా 11 ఇన్నింగ్స్ ల‌లో 10 ఇన్నింగ్స్ ల‌లో ఫెయిల్ అయినా ఎంపిక చేయ‌డం ప‌ట్ల క్రికెట్ అభిమానుల‌తో పాటు తాజా, మాజీ క్రికెట‌ర్లు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. సోష‌ల్ మీడియాలో మొత్తం సంజూ శాంస‌న్(Sanju Samson)  పేరుతో మారు మ్రోగింది. ఒక ర‌కంగా ట్రెండింగ్ లో కొన‌సాగుతూ వ‌స్తున్నాడు.

ఆపై రిష‌బ్ పంత్ , బీసీసీఐ , ల‌క్ష్మ‌ణ్ ట్రోలింగ్ కు గుర‌య్యాడు. ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఐసీసీ ట్రీఫీలో దూరం పెట్టారు శాంస‌న్ ను. ఆ త‌ర్వాత గ‌త్యంత‌రం లేక న్యూజిలాండ్ టూర్ లో ఎంపిక చేసినా కేవ‌లం ఒక్క మ్యాచ్ లో ఆడించారు. ఈ సంద‌ర్భంగా ధావ‌న్, పాండ్యాలు చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు ఫ్యాన్స్.

దీంతో ఉన్న‌ట్టుండి రిష‌బ్ పంత్ కు గాయం కావ‌డంతో అత‌డి స్థానంలో వికెట్ కీప‌ర్ , బ్యాట‌ర్ గా ప‌నికొస్తాడ‌ని శాంస‌న్ ను ఎంపిక చేయాల‌ని బీసీసీఐ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో బంగ్లాదేశ్ టూర్ కు సంజూకు(Sanju Samson)  ఛాన్స్ ద‌క్క‌నుంద‌ని టాక్.

అద్భుత‌మైన ప్ర‌తిభ‌, టెక్నిక్ , ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనైనా దూకుడు చూపే త‌త్వం , వికెట్ కీపింగ్ ..ఫీల్డింగ్ లో రాణిస్తున్నాడు సంజూ శాంస‌న్. ఆదివారం నుంచి బంగ్లా టూర్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ఎంపిక చేయాల‌న్న ఒత్తిడి పెరగ‌డం కూడా కార‌ణంగా తోస్తోంది.

Also Read : సంజూ శాంస‌న్ కంటే పంత్ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!