PAK vs ENG 1st Test : హ్యారీ బ్రూక్ షాన్ దార్ ఇంగ్లండ్ జోర్దార్
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు 80 బాల్స్ లో సెంచరీ
PAK vs ENG 1st Test : పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు ఇంగ్లండ్ బ్యాటర్లు. హ్యారీ బ్రూక్ దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం ఆరు బంతుల్లో 6 ఫోర్లు బాదాడు. ఆపై 16 బంతుల్లో ఏకంగా 68 రన్స్ చేశాడు. భయంకరమైన ఇన్నింగ్స్ తో చెలరేగాడు. మైదానంలోకి వచ్చీ రావడంతోనే బాదడం మొదలు పెట్టాడు.
అతడి విధ్వంసకరమైన బ్యాటింగ్ తో బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. షకీల్ వేసిన 68వ ఓవర్ లో తన ప్రతాపాన్ని చూపించాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లండ్ దుమ్ము రేపింది. ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించారు.
ఓపెనర్లు జాక్ క్రాలే 111 బంతులు ఆడి 122 రన్స్ చేస్తే బెన్ డకెట్ 110 బాల్స్ ఆడి 107 పరుగులు చేశాడు. ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ కూడా తానేమీ తక్కువ కాదంటూ చెలరేగాడు. కేవలం 104 బంతులు ఆడి 108 రన్స్ చేశాడు. జో రూట్ కేవలం 23 రన్స్ చేసి లెగ్ బిఫోర్ వికెట్ గా వెనుదిరిగాడు.
ఇదిలా ఉండగా మైదానంలోకి వచ్చీ రావడంతోనే బ్రూక్ సౌద్ పూనకం వచ్చినట్లు ఆడాడు. పాకిస్తాన్(PAK vs ENG 1st Test) బౌలర్లను ఉతికి ఆరేశాడు. మారథాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాది చరిత్ర సృష్టించాడు. 80 బంతులు ఆడి 14 ఫోర్లు 2 సిక్సర్లతో కెరీర్ లో తన తొలి సెంచరీని పూర్తి చేశాడు బ్రూక్ సౌదీ.
4 వికెట్లు కోల్పోయి 506 రన్స్ చేసింది ఇంగ్లండ్. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్ 34 రన్స్ తో ఉన్నాడు.
Also Read : సెలెక్టర్ల ఎంపికకు అడ్వైజరీ కమిటీ