Japan VS Spain FIFA 2022 : స్పెయిన్ పరేషాన్ జపాన్ సెన్సేషన్
20 ఏళ్ల తర్వాత నాకౌట్ కు చేరిక
Japan VS Spain FIFA 2022 : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హాట్ ఫెవరేట్ గా ఉన్న జట్లు గోల్స్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నాయి. మరో వైపు సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓటమి పాలైంది. అందరినీ విస్తు పోయేలా చేసింది.
ఇక ఇవాళ జరిగిన కీలక మ్యాచ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జపాన్(Japan VS Spain FIFA 2022) ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది స్పెయిన్ కు. ఏకంగా 2-1 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అంతే కాదు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జపాన్ ఫిఫా వరల్డ్ కప్ 2022లో నాకౌట్ కు చేరింది.
రౌండ్ 16కు అర్హత సాధించింది జపాన్. ఇరు జట్ల మధ్య ఆట ఆసక్తికరంగా జరిగింది. మ్యాచ్ విషయానికి వస్తే ఆట ప్రథమార్థంలో ఎలాంటి గోల్ చేయలేక పోయింది జపాన్. ప్రారంభం నుంచే బలమైన జట్టుగా పేరొందిన స్పెయిన్ అటాకింగ్ మొదలు ఎట్టింది. తొలి 10 నిమిషాల్లోనే అద్భుతమైన గోల్ సాధించింది.
ఆ టీమ్ కు చెందిన మొరాటా గోల్ చేసి స్పెయిన్ లో మరింత విశ్వాసం పెంచాడు. ఆ తర్వాత ప్రథామర్థం అంతా గోల్ చేసేందుకు యత్నించినా జపాన్ తట్టుకోలేక పోయింది. అనంతరం ద్వితీయార్థం (సెకండ్ ఆఫ్ ) లో జపాన్ ఊహించని రీతిలో అటాక్ పెంచింది. మూడో నిమిషంలోనే జపాన్ కు చెందిన ఆటగాడు రిత్సు డోన్ అద్బుతంగా గోల్ చేశాడు.
ఆ తర్వాత మరో మూడు నిమిషాల్లోపే టనాక ఇంకో గోల్ సాధించి విస్తు పోయేలా చేశాడు. దీంతో స్పెయిన్ పై 2-1 ఆధిక్యంలోకి నెట్టాడు. కనీసం డ్రా చేసుకుందామని స్పెయిన్ చేసిన ప్రయత్నం ఏమీ సఫలం కాలేదు. దీంతో జపాన్ విక్టరీ సంచలనంగా మారింది.
Also Read : శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలి – బదానీ