India President Andhra Pradesh : ఏపీలో రాష్ట్ర‌ప‌తికి సాద‌ర స్వాగ‌తం

వెల్ కం చెప్పిన గ‌వ‌ర్న‌ర్..సీఎం

India President Andhra Pradesh : భార‌తదేశ రాష్ట్ర‌ప‌తిగా కొలువు తీరిన అనంత‌రం ద్రౌప‌ది ముర్ము(India President) మొట్ట మొద‌టి సారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాలు మోపారు. రాష్ట్రంలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగతం ప‌లికారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ , ముఖ్య‌మంత్రి సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ మొత్తం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌లో మునిగి పోయింది. అంత‌కు ముందు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌న‌కు ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. ఆ త‌ర్వాత ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ స‌మ‌యంలో ఏపీ సీఎంతో పాటు ఎంపీ విజ‌య సాయిరెడ్డి కూడా ఉన్నారు.

అంత‌కు ముందు ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు(India President) పోలీసులు గౌర‌వ వందనం చేశారు. ఆమెకు స్వాగ‌తం ప‌లికిన వారిలో కేంద్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రప‌తి నేరుగా పోరంకికి వెళ్లారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే పౌర స‌న్మాన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ముర్ము పాల్గొంటారు.

అక్క‌డి నుంచి గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ విశ్వ భూష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. ఈ టూర్ లో రెండు రోజులు ఉంటారు. విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తిరుప‌తి ప్రాంతాల్లో జ‌రిగే వివిధ కార్య‌క్ర‌మాల‌లో రాష్ట్ర‌ప‌తి పాల్గొంటారు. ఇందులో భాగంగా విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగే నేవీ వేడుక‌ల్లో పాల్గొంటారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఏపీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఆమె ప‌ర్య‌టించే ప్రాంతాల‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

Also Read : కోట్లు కొల్ల‌గొట్టిన టీటీడీ బోర్డు మెంబ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!