Delhi MCD Elections : ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు
ఓట్లు వేసిన ప్రముఖులు..సీఎం..డిప్యూటీ సీఎం
Delhi MCD Elections : దేశ రాజధాని ఢిల్లీలో మహానగర ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం తమ ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. కొందరి ఓటర్లు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనిల్ చౌదరి ఓటు వేసేందుకు వెళ్లగా లేదని తేలింది. తన ఓటు జాబితాలో లేక పోవడంతో ఆయన విస్తు పోయారు.
కావాలని ఆప్ ప్రభుత్వం తమ ఓటర్లు తొలగించిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు , ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఇదిలా ఉండగా మొత్తం 250 వార్డులలో పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
సాయంత్రం 5.30 గంటల దాకా కొనసాగుతుంది. మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఢిల్లీ నగరంలో కోటి 45 లక్షల మంది ఓటర్లు ఆయా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఇదిలా ఉండగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబీకులతో సహా కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ వాసులకు తమ విలువైన ఓటును(Delhi MCD Elections) పని చేసే వారికి వేయాలని సీఎం కోరారు. స్వచ్ఛ ఢిల్లీ కోసం, ధర్మ, సమర్థవంతమైన పాలన కోసం అభ్యర్థులను ప్రత్యేకించి పని చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు అరవింద్ కేజ్రీవాల్.
ఈ పౌర ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి తాము పవర్ లోకి వస్తామని భావిస్తోంది ఆప్ సర్కార్. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆ పార్టీకి మచ్చగా మారింది. ఇదే సమయంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం తమ లక్ ను పరీక్షించు కోనున్నాయి.
Also Read : ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ ఓటు గల్లంతు