Diljit Dosanjh Sidhu : సిద్దూ హత్య కేసులో ప్రభుత్వం విఫలం
ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఫైర్
Diljit Dosanjh Sidhu : భారత దేశంలో టాప్ సింగర్ పేరొందిన దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh) సంచలన కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన పంజాబ్ కు చెందిన సింగర్ సిద్దూ మూసేవాలాను దారుణంగా హత్య చేశారు. ఇంకా అసలు నిందితులను అరెస్ట్ చేయలేక పోయింది ప్రభుత్వం. ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు దిల్జిత్ దోసాంజ్.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగర్ సిద్దూ మూసే వాలా(Sidhu Moose wala)ను హత్య చేయడం బాధాకరమన్నాడు. ఒక ఆర్టిస్ట్ (కళాకారుడు) గా తాను ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మొత్తం వ్యవహారానికి పంజాబ్ లో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రభుత్వానిదేనంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీ పెరిగినా ఎందుకు ఆలస్యం జరుగుతోందంటూ ప్రశ్నించాడు. సర్కార్ ను తీవ్రంగా నిందించాడడు. మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలో సిద్దూ మూసే వాలాగా ప్రసిద్ది చెందిన శుభ దీప్ సింగ్ సిద్దూ కాల్చి చంపబడ్డాడు. మూసేవాలా పేరెంట్స్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారంటూ నిప్పులు చెరిగాడు దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh).
ఫిల్మ్ కంపానియన్ తో మాట్లాడాడు ప్రముఖ గాయకుడు. అందరూ బతకాలని కోరుకుంటారు. ప్రధానంగా కళా రంగంలోకి వచ్చిన వారంతా కష్టపడి పైకి వచ్చిన వాళ్లే. ఇటీవల కారు ప్రమాదంలో మరణించిన దీప్ సిద్దూ గురించి కూడా ఆవేదన చెందాడు దిల్జిత్ దోసాంజ్.
Also Read : ధిక్కార స్వరం దిగొచ్చిన ప్రభుత్వం