IND vs BAN 1st ODI : బంగ్లా బౌల‌ర్ల దెబ్బ‌కు భార‌త్ విల‌విల

రాణించిన రాహుల్ ..186 ర‌న్స్ కు ఆలౌట్

IND vs BAN 1st ODI : పిల్ల కూన‌లుగా భావించిన భార‌త జ‌ట్టుకు చుక్క‌లు చూపించారు బంగ్లాదేశ్ బౌల‌ర్లు. బంగ్లా టూర్ లో భాగంగా ఢాకా వేదిక‌గా తొలి వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. బంగ్లాదేశ్ స్కిప్ప‌ర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ‌రిలోకి దిగిన టీమిండియా ఆశించిన మేర రాణించ లేక పోయింది.

ప్ర‌ధానంగా బంగ్లా బౌల‌ర్ల దెబ్బ‌కు ఏ ఒక్క‌రూ ఎదురు నిల‌వేల‌క పోయారు. బీసీసీఐ నిర్వాకానికి భార‌త జ‌ట్టు ఆడుతున్న తీరుకు స‌రి పోయింది. అద్భుతంగా ఆడుతున్న శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టారు. త‌మ స్వ ప్ర‌యోజ‌నాల కోసం ఆడే ఆట‌గాళ్ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు.

వ‌ర‌ల్డ్ వైడ్ గా టాప్ పొజిష‌న్ లో ఉన్న టీమ్ ఇండియా(IND vs BAN 1st ODI) ఏ మాత్రం త‌న స్థాయికి త‌గ్గట్టు ఆడ‌లేక పోయింది. ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దారుణంగా విఫ‌ల‌మైన కేఎల్ రాహుల్ ఎట్ట‌కేల‌కు రాణించాడు. 74 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 27 ర‌న్స్ చేశాడు. టెయిలెండ‌ర్ల‌తో క‌లిసి జ‌ట్టు స్కోర్ ను 180ని దాటించాడు రాహుల్.

ఇక రాణిస్తార‌ని ఆశించిన భార‌త బ్యాట‌ర్లు ఎక్క‌డా ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌లేక చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించారు బంగ్లాదేశ్ బౌల‌ర్లు. పేస‌ర్ హెబాద‌త్ హుసేన్ రెచ్చి పోయాడు. పిచ్ బౌన్స్ ను క్లియ‌ర్ గా వాడుకున్నాడు. నాలుగు వికెట్లు తీశాడు. ఇక ప్ర‌ముఖ స్పిన్న‌ర్ గా పేరొందిన ష‌కీబుల్ హ‌స‌న్ కు ఏకంగా 5 వికెట్లు ద‌క్క‌డం విశేషం.

Also Read : వ‌న్డే సీరీస్ కు రిష‌బ్ పంత్ దూరం

Leave A Reply

Your Email Id will not be published!