Yogendra Yadav Comment : రాహుల్ యాత్ర ‘యోగేంద్ర’ కథ
ప్రజల ఆశలకు ప్రతీక భారత్ జోడో యాత్ర
Yogendra Yadav Comment : ఎవరు ఔనన్నా కాదన్నా ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చర్చనీయాంశంగా మారింది. 150 రోజులు 3,570 కిలోమీటర్ల మేర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. మాజీ చీఫ్ కూడా. ప్రస్తుతం వాయనాడు ఎంపీగా ఉన్నారు.
ఘనమైన వారసత్వం ఆయన కుటుంబానికి ఉంది. ఎన్నో అవకాశాలు వచ్చినా దేనినీ ఉపయోగించు కోలేదు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది.
అన్నిటికంటే ఐసీయూలో ఉందని చెప్పక తప్పదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం అనేది ఉంటుంది. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న భారత్ జోడో యాత్ర వెనుక ఎవరు ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఉద్యమం వెనుక..
ప్రతి పోరాటం జరగడం వెనుక చాలా కారణాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువగా మేధావులు, ఆలోచనాపరులు, బుద్ది జీవులు, కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు తప్పక ఉంటారు.
ఈ దేశంలో రెండు ఉద్యమాలు పెద్ద ఎత్తున ఆకర్షించేలా చేశాయి. సమున్నత భారతావనిని ప్రభావితం చేశాయి. అంతకంటే విస్తు పోయేలా చేశాయి. సంయుక్త కిసాన్ మోర్చా సారథ్యంలో అలుపెరుగని రీతిలో రైతులు చేపట్టిన పోరాటం. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా చేసింది.
ఆపై నియంతగా , మరో హిట్లర్ గా పేరొందిన నరేంద్ర మోదీ సైతం తనంతకు తానుగా జాతికి క్షమాపణలు చెప్పారు. తాము తీసుకు వచ్చిన సాగు చట్టాలను రద్దు చేసేలా చేసింది.
ఇందులో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది మాత్రం భారత్ జోడో యాత్ర. దీని వెనుక ప్రముఖ సామాజిక వేత్త , మేధావిగా పేరొందిన యోగేంద్ర యాదవ్(Yogendra Yadav) ఉన్నారనేది బహిరంగ రహస్యం.
ఓ వైపు మోదీ త్రయంతో పాటు అంబానీ, అదానీ, టాటా లాంటి వ్యాపారవేత్తలు, కుబేరులు దేశాన్ని కబలిస్తున్న తరుణంలో, ప్రభుత్వ రంగ సంస్థలు గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన సమయంలో ఒక్కసారిగా పాదయాత్ర చర్చకు దారి తీసింది.
ఎన్నో ప్రశ్నలను లేవదీసింది. అంతే కాదు ఇంత కాలం మతం, కులం, ప్రాంతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ మీడియాను మ్యానేజ్ చేస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మరోసారి పునరాలోచించుకునేలా చేస్తింది రాహుల్ యాత్ర.
మొదట ఆయనను పప్పు అన్నారు..పాలిటిక్స్ కు పనికిరాడు అన్నారు. ఆయనకు దేశం గురించి అవగాహన లేదన్నారు. కానీ రాను రాను రాహుల్ గాంధీ ఇప్పుడు నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా మారేలా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు.
దీని వెనుక ఉన్నది మాత్రం యోగేంద్ర యాదవ్ అని చెప్పక తప్పదు. ఎక్కడా పార్టీ గురించి ప్రస్తావించకుండా యాత్రను కంటిన్యూ చేసేలా తీర్చిదిద్దారు రాహుల్ గాంధీని. ఇది మరో స్వరాజ్య యాత్రగా అభివర్ణించారు యాదవ్. ఇప్పుడు కాక పోతే ఇంకెప్పుడూ కాంగ్రెస్ బతికి బట్ట కట్టదని హెచ్చరించారు.
ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జీవం పోసేలా చేసింది అనడంలో తప్పు లేదు. ఈ సందర్బంగా యేగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాల్సి ఉంటుంది.
భారత్ జోడో యాత్ర ఒక పార్టీకి చెందినది కాదు. అనేక ప్రజా ఉద్యమాలకు చెందిన వారు, స్వచ్చంధ సంస్థలు, కార్యకర్తలే కాదు అన్ని వర్గాలకు చెందిన
వారంతా ఇందులో పాలు పంచుకుంటున్నారు. ఇది మరో స్వాతంత్ర ఉద్యమమని పేర్కొన్నారు.
వాళ్లు కూల్చి వేస్తారు..కానీ మేం తిరిగి నిర్మిస్తామని యేగేంద్ర యాదవ్(Yogendra Yadav) ప్రకటించారు. ఇంతలా ప్రయత్నం చేసిన ఆయనకు సలాం చేయకుండా ఉండలేం.
Also Read : మోదీ నమ్మదగిన నాయకుడు కాదు