James Anderson : జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన రికార్డ్

అత్య‌ధిక జాబితాలో మూడో ప్లేస్

James Anderson : ఇంగ్లండ్ స్టార్ బౌల‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్ చ‌రిత్ర సృష్టించాడు. అరుదైన రికార్డు సృష్టించాడు. ప్ర‌పంచ క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు.

క‌ళ్లు చెదిరే బంతుల్ని వేయ‌డంలోనే కాదు ఊహించ‌ని రీతిలో వికెట్ల‌ను కూల్చ‌డంలో త‌న‌కు తానే సాటి. అందుకే ఎంతో అనుభ‌వం క‌లిగిన బ్యాట‌ర్లు అయినా ఒక్కోసారి జేమ్స్ అండ‌ర్స‌న్(James Anderson) బౌలింగ్ ను ఆడాలంటే ఇబ్బంది ప‌డ‌తారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇంగ్లండ్ జ‌ట్టుకు మూల స్తంభం లాంటోడు.

తాజాగా పాకిస్తాన్ టూర్ లో భాగంగా జ‌రిగిన మొద‌టి టెస్టులో ఇంగ్లండ్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. పాకిస్తాన్ పై 74 ప‌రుగుల ఇన్నింగ్స్ తేడాతో షాక్ ఇచ్చింది.

టెస్టు డ్రా అవుతుంద‌ని క్రికెట్ అభిమానులే కాదు పాకిస్తాన్ ప్లేయ‌ర్లు కూడా తాపీగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో జేమ్స్ అండ‌ర్స‌న్(James Anderson) నిప్పుల్లాంటి బంతుల‌కు చేతులెత్తేశారు. ఏకంగా నాలుగు కీల‌క వికెట్ల‌ను ప‌డగొట్టాడు. దీంతో ఇంగ్లండ్ కు అద్భుత‌మైన విజ‌యాన్ని అందించాడు.

ఈ మ్యాచ్ లో సాధించిన వికెట్ల‌తో అత్య‌ధిక వికెట్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. మూడో స్థానంలో నిలిచాడు. భార‌త క్రికెట్ కు చెందిన అనిల్ కుంబ్లే సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు.

మ్యాచ్ లో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో రెండో వికెట్ తీయ‌డంతో కుంబ్లే సాధించిన 956 వికెట్ల‌ను దాటేశాడు. ఇక ఫ‌స్ట్ ప్లేస్ లో శ్రీ‌లంక‌కు చెందిన స్టార్ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ టాప్ లో ఉన్నాడు. 1, 347 వికెట్లు తీశాడు. దివంగత ఆసిస్ స్పిన్న‌ర్ షేన్ వార్న్ 1,001 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు.

Also Read : మొద‌టి టెస్టులో పాక్ పై ఇంగ్లండ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!