IND vs BAN 2nd ODI : ఇకనైనా రాణిస్తారా లేక చేతులెత్తేస్తారా
బంగ్లాదేశ్ తో భారత్ రెండో వన్డే
IND vs BAN 2nd ODI : పసికూనలే కదా అని టేకిట్ ఈజీగా తీసుకున్న భారత జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్. వరుసగా వికెట్లు కోల్పోయినా ఎక్కడా తగ్గకుండా దుమ్ము రేపింది బంగ్లా. కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది.
పేలవమైన ఆట తీరుతో టీమిండియా చేతులెత్తేసింది. బంగ్లాదేశ్ లో(IND vs BAN 2nd ODI) పర్యటిస్తున్న భారత్ మూడు వన్డేల సీరీస్ తో పాటు రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ ఆడనుంది. ఇప్పటికే ధావన్ సారథ్యంలోని భారత్ వన్డే సీరీస్ 0-1 తేడాతో కీవీస్ తో సీరీస్ కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టోర్నీలో సెమీస్ లోనే 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఇండియా ఘోరంగా పరాజయం పాలైంది.
ఈ తరుణంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. మొదటి వన్డే మ్యాచ్ లో ఓడి పోయిన భారత్ ఎలాగైనా సరే రెండో వన్డే మ్యాచ్ లో గెలుపొందాలని భావిస్తోంది. మరో వైపు థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన బంగ్లాదేశ్ ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటాలని చూస్తోంది.
ఇదిలా ఉండగా అద్భుతంగా రాణిస్తున్న కేరళ స్టార్ సంజూ శాంసన్ ను కావాలని బీసీసీఐ పక్కన పెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రోహిత్ సేన తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, షాబాజ్ అహ్మద్ ను తీసుకోనున్నారు.
Also Read : మహిళా బ్యాటింగ్ కోచ్ గా కనిత్కర్