AAP MCD Win Comment : అపూర్వం ప్ర‌జాస్వామ్య విజ‌యం

ఢిల్లీ న‌గ‌ర పాల‌క ఎన్నిక‌ల్లో ఆప్ హ‌వా

AAP MCD Win Comment : ప్ర‌జాస్వామ్యం బ‌తికే ఉంద‌ని నిరూపించారు దేశ రాజ‌ధాని ఢిల్లీ పౌరులు. దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయా అన్నంత ఉత్కంఠ‌, ఉద్వేగాన్ని క‌లుగ చేశాయి ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌లు. దాదాపు 15 ఏళ్లుగా భార‌తీయ జ‌నతా పార్టీ

ఢిల్లీ న‌గ‌రం త‌న గుప్పిట్లో పెట్టుకుంది.

ఓ వైపు కేంద్రంలో మ‌రో వైపు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ద్వారా..ఎంసీడీ తో క‌లిసి ఎన్నో ర‌కాలుగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌చ్చింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం క‌ల‌క‌లం రేపింది.

ఆపై ఆప్ కు చెందిన మంత్రి స‌త్యేంద్ర జైన్ అరెస్ట్, జైలులో ఖ‌రీదైన తిండి, జ‌ల్సాలు, మ‌సాజ్ ల‌కు సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైర‌ల్ అయ్యాయి. సోష‌ల్ మీడియాలో అవే హాట్ టాపిక్ గా మారాయి.

ఇదే క్ర‌మంలో ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎంకు కుడి భుజంగా ఉంటూ వ‌చ్చిన డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాపై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ఆపై ఢిల్లీ మ‌ద్యం పాల‌సీలో మొత్తం 15 మందిపై అభియోగాలు మోపింది.

ఇందులో నెంబ‌ర్ 1గా సిసోడియాను చేర్చింది. కానీ అరెస్ట్ చేయ‌లేక పోయింది. నేడో రేపో అరెస్ట్ చేయొచ్చు కూడా. ఈ స‌మ‌యంలో సుదీర్ఘ కాలం పాటు 

కాపాడుకుంటూ వ‌స్తున్న ఢిల్లీ న‌గ‌ర పీఠం కోల్పోవ‌డం ఒక ర‌కంగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి, దాని అనుబంధ కాషాయ శ్రేణుల‌కు మింగుడు ప‌డ‌ని అంశం. 

కులం, ప్రాంతం, మ‌తం , విద్వేష పూరిత రాజ‌కీయాలు ఎల్ల‌ప్పుడూ వ‌ర్క‌వుట్ కావ‌ని నేటి ఫ‌లితాల‌తో రూఢీ అయ్యింది. ఇదే విష‌యాన్ని అర‌వింద్ కేజ్రీవాల్ స్ప‌ష్టం చేశారు. వెన్నుపోట్లు, కుట్ర‌లు, కుతంత్రాలు, ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ప‌క్క‌న పెట్టండి. క‌లిసిక‌ట్టుగా 

ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో చేసి చూపిద్దామ‌ని పిలుపునిచ్చారు. బీజేపీ విమ‌ర్శ‌లతోనే కాలం వెలిబుచ్చితే ఆప్ తన‌కు అవ‌కాశం ఇస్తే తాను ఏం చేస్తానో చెప్పింది.

అందులో ప్ర‌ధానమైన‌ది విద్య‌, వైద్యం, న్యాయం, ఉపాధి, మ‌హిళా సాధికార‌త‌. ఇవి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయ‌ని చెప్ప‌లేం. కానీ ప్ర‌తి రోజూ మ‌నుషుల‌కు కావాల్సింది ఏమిటి. బ‌త‌కాలి..దానికోసం చ‌దువుండాలి..ఆరోగ్యం బాగా లేక పోతే చూయించుకునేందుకు త‌క్కువ ఖ‌ర్చుతో ఆరోగ్య కేంద్రాలు ఉండాలి. ఇలాంటి వాటిపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.

అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేశారు. ఇంత చేసినా బీజేపీకి 104 సీట్లు వ‌చ్చాయ‌ని అనుకోవ‌చ్చు. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్, కాన్షీరామ్ ఎప్పుడో

చెప్పారు. ప్ర‌జాస్వామ్యం బ‌లంగా ఉండాలంటే బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉండాల‌ని. అందుకే ఢిల్లీ వాసులు స‌రైన తీర్పు చెప్పారు. సానుకూల దృక్ఫ‌థంతో కూడిన రాజ‌కీయాలు అవ‌స‌రం.

ఇదే ప్ర‌జ‌లు కోరుకున్నారు. రాబోయే రోజుల్లో నోట్లు, కోట్లు, కార్పొరేట్లు జ‌నం కోరుకోరు అన్న‌ది నిరూపించారు. ప్రాథ‌మిక అవ‌స‌రాలు క‌ల్పించే వాళ్లకే

ప‌ట్టం క‌డ‌తార‌ని నిరూపించారు. ఏది ఏమైనా ఆప్ కు 134 సీట్లు రావ‌చ్చు.

 కానీ అంతిమంగా ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు అద్భుతం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇది నిజ‌మైన ప్రజాస్వామ్యానికి ప్ర‌తీక అని చెప్పలేం. కానీ విద్వేష‌, 

క‌లుషితమైన ఈ స‌మాజంలో, ప్ర‌స్తుత త‌రుణంలో ఇలాంటి తీర్పులు పాఠంగా మిగులుతాయ‌ని చెప్ప‌డంలో అతిశ యోక్తి లేదు.

Also Read : నిన్న‌ సామాన్యులు నేడు విజేత‌లు

Leave A Reply

Your Email Id will not be published!