Mehidy Hasan Mahmudullah : మిరాజ్..మహ్మదుల్లా రికార్డ్ బ్రేక్
17 ఏళ్ల చరిత్రను తిరగ రాశారు
Mehidy Hasan Mahmudullah : వన్డే చరిత్రలో అరుదైన రికార్డును నమోదు చేశారు బంగ్లా క్రికెటర్లు. భారత్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో బంగ్లా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఒకానొక దశలో కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టును ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ కు తీసుకు వెళ్లారు మెహదీ హసన్ మిరాజ్ , మహ్మదుల్లా(Mehidy Hasan Mahmudullah).
రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు వీరిద్దరూ. ఏకంగా 17 ఏళ్ల కిందట నమోదైన రికార్డును తిరగ రాశారు. అప్పటి వరకు 19 ఓవర్లు మాత్రమే ముగిశాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా మెహదీ హసన్ మిరాజ్ , మహ్మదుల్లా కలిసి భారత బౌలర్ల భరతం పట్టారు. మిరాజ్ కేవలం 83 బంతులు మాత్రమే ఆడి 4 సిక్సర్లు 8 ఫోర్లతో సెంచరీ చేశాడు.
తన కెరీర్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. మెహదీ హసన్ మిరాజ్ , మహ్మదుల్లా కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 96 బంతులు ఆడి 77 పరుగులు చేసిన మహ్మదుల్లా ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బంతికి అవుటయ్యాడు. ఒకవేళ అలాగే ఉంటే బంగ్లా స్కోర్ 300 దాటి ఉండేది.
ఇన్నింగ్స్ చివరి బంతికి సెంచరీ చేశాడు మిరాజ్. అంతకు ముందు 7వ వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని దంబుల్లాలో శ్రీలంకకు చెందిన మహేళ జయవదర్దనే, ఉపుల్ చందనాల మధ్య 126 పరుగులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ రికార్డును మిరాజ్, అహ్మదుల్లా చెరిపేశారు.
2000లో నాగ్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ , లాన్స్ క్లూసెనర్ కలిసి 114 పరుగులు చేశారు.
Also Read : మిరాజ్ మారథాన్ ఇన్నింగ్స్