Gautam Gambhir : గౌతమ్ గంభీర్ ఇలాఖాలో బీజేపీ హవా
మిగతా బీజేపీ ఎంపీలకు ఆప్ బిగ్ షాక్
Gautam Gambhir : ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్ము రేపింది. మొత్తం 250 వార్డు స్థానాలకు గాను పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. 15 ఏళ్లకు పైగా ఎంసీడీని గుప్పిట్లో పెట్టుకుంది. బీజేపీ 104 సీట్లు దక్కితే ఆమ్ ఆద్మీ పార్టీకి 134 సీట్లు లభించాయి. దీంతో ఢిల్లీ నగరం పూర్తిగా ఆప్ స్వాధీనం అయ్యింది. పెద్ద ఎత్తున ప్రచారం చేసినా చివరకు నిరాశే మిగిలింది బీజేపీకి.
ఇదిలా ఉండగా ఢిల్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి చెందిన ఎంపీలలో మాజీ క్రికెటర్ , ప్రస్తుతం ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గంలో అత్యధికంగా వార్డులను గెలుచుకుంది బీజేపీ. మిగతా ఎంపీల నియోజకవర్గాలలో బీజేపీ ఆశించిన రీతిలో వార్డులను గెలుచుకోలేక పోయింది. ఆప్ ఆధిపత్యం కనబర్చడం విశేషం. ఇక వార్డుల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి.
గౌతమ్ గంభీర్ లోక్ సభ నియోజకవర్గంలో 36 వార్డులకు గాను 22 వార్డులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక మరో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 41 వార్డులకు గాను 21 మాత్రమే వచ్చాయి. మరో ఎంపీ హర్షదేవ్ సింగ్ ఇలాఖాలో 30 వార్డులకు గాను 16 వార్డుల్లో గెలుపొందింది బీజేపీ.
ఇక ప్రవేశ్ వర్మకు సంబంధించి 38 వార్డులకు గాను 14 మాత్రమే బీజేపీకి వచ్చాయి. హన్స్ రాజ్ కు సంబంధించి 43 వార్డులకు గాను 14 మాత్రమే బీజేపీకి వచ్చాయి. రమేష్ ప్రాతినిధ్యం వస్తున్న ఇలాఖాలో 37 వార్డులకు గాను 13 గెలుపొందగా ఎంపీ మీనాక్షి లేఖి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో 25 వార్డులకు గాను కేవలం 6 వార్డులు గెలుపొందింది బీజేపీ.
Also Read : గుజరాత్..హిమాచల్ ఓట్ల లెక్కింపు