Virender Sehwag : టీమిండియా ఫామ్ పై సెహ్వాగ్ సెటైర్
దేశం కోసం ఆడుతున్నామన్న ధ్యాస లేదా
Virender Sehwag : భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టు పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశకు గురు చేస్తుండడంపై సీరియస్ గా స్పందించాడు. ఐపీఎల్ లో రాణిస్తున్నా ఎందుకని అంతర్జాతీయ మ్యాచ్ లలో ఆడలేక పోతున్నారంటూ మండిపడ్డారు.
ఒక్కోసారి క్రిప్టో కరెన్సీ కంటే వేగంగా ఫామ్ కోల్పొవడం తనను విస్తు పోయేలా చేసిందన్నాడు. ప్రధానంగా ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో పాటు ఆటగాళ్లను ఏకి పారేశాడు. టి20 మ్యాచ్ లపై ఉన్నంత శ్రద్ద వన్డేలు, టెస్టు మ్యాచ్ ల గురించి పట్టించు కోవడం లేదని ఆరోపించాడు వీరేంద్ర సెహ్వాగ్.
భారత జట్టులో ఆడుతున్న వాళ్లు ఎవరి కోసం ఆడుతున్నామో తెలుసుకుని ఆడితే బాగుంటుందని సూచించాడు. ప్రొఫెషన్స్ లాగా తమ కెరీర్ ను ఎంచు కోవడం లేనట్టు తనకు అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా బీసీసీఐ మేలుకుంటే మంచిదని లేక పోతే ఇంకెన్ని అనామక జట్లతో భారత జట్టు ఓడిపోవాల్సి వస్తుందోనంటూ ఎద్దేవా చేశాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).
వచ్చే ఏడాది 2023లో భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుందని, ఇప్పటికైనా బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ, హెడ్ కోచ్ , మేనేజ్ మెంట్ కలిసి కూర్చుని సమస్య ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చాడు. ఇలాగే వదిలి వేస్తే భారత జట్టు మరిన్ని అపజయాలు మూట గట్టు కోవడం ఖాయమని జోష్యం చెప్పాడు.
ప్రస్తుతం వీరూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : భారత్ పరాజయం బీసీసీఐపై ఆగ్రహం