FIFA World Cup 2022 : ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ కు చేరేదెవ‌రో

క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కు ఎనిమిది జ‌ట్లు

FIFA World Cup 2022 : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ – 2022 (FIFA World Cup 2022) తుది అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతూ ఇప్ప‌టి దాకా లీగ్ మ్యాచ్ లు సాగాయి. ఆశించిన జ‌ట్లకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాకౌట్ ద‌శ పూర్త‌యింది. ఇక ఎనిమిది జ‌ట్లు క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కు చేరుకున్నాయి.

మెగా టోర్నీలో మొత్తం 32 జ‌ట్లు పాల్గొన్నాయి. ఇందులో 16 జ‌ట్లు నాకౌట్ కు చేరుకోగా వాటిలో 8 జ‌ట్లు క్వార్ట‌ర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఇక ఎప్ప‌టి లాగే టైటిల్ ఫేవ‌రేట్ గా భావించిన మాజీ ఛాంపియ‌న్ స్పెయిన్ కు బిగ్ షాక్ త‌గిలింది. అనామ‌క జ‌ట్టుగా భావించిన మొరాకో షూటౌట్ లో ఏకంగా 3-0 తేడాతో మ‌ట్టి క‌రిపించింది.

ఇది ఫుట్ బాల్ అభిమానుల‌ను విస్తు పోయేలా చేసింది. దీంతో అభిమానులు ఏ స‌మ‌యంలోనైనా ఆందోళ‌న‌లకు దిగే అవ‌కాశం ఉంద‌ని స్పెయిన్ లో పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మోహ‌రించాయి. ఇంత‌లా అభిమానం ముదిరి పోయింది. ఇక క్వార్ట‌ర్స్ చేరుకున్న జ‌ట్లలో పోర్చుగ‌ల్ , మొరాకో, ఫ్రాన్స్ , ఇంగ్లండ్ , బ్రెజిల్ , క్రొయేషియా, అర్జెంటీనా, నెద‌ర్లాండ్స్ ఉన్నాయి.

డిసెంబ‌ర్ 9 శుక్ర‌వారం నుంచి ఎనిమిది జ‌ట్లు సెమీస్ కోసం పోటీ ప‌డ‌నున్నాయి. ఇక క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో తొలి మ్యాచ్ లో బ్రెజిల్, క్రొయేషియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. రాత్రి 8.30 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. ఇందులో బ్రెజిల్ బ‌లంగా క‌నిపిస్తున్నా ఏ స‌మ‌యంలో ఏ జ‌ట్టు గెలుస్తుందో చెప్ప‌డం క‌ష్టం.

ఇక డిసెంబ‌ర్ 10న పోర్చుగ‌ల్ తో మొరాకో, నెద‌ర్లాండ్స్ తో అర్జెంటీనా త‌ల‌ప‌డతాయి. డిసెంబ‌ర్ 11న ఇంగ్లండ్, ఫ్రాన్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతుంది.

Also Read : టీమిండియా ఫామ్ పై సెహ్వాగ్ సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!