IND vs BAN 3rd ODI : ఆఖ‌రి మ్యాచ్ లో నైనా గెలుస్తారా

0-2 తేడాతో వన్డే సీరీస్ ఓట‌మి

IND vs BAN 3rd ODI : జాబితా చూస్తే టాప్ ప్లేయ‌ర్లు. కానీ ఆట వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా చేతులెత్తేయ‌డం అల‌వాటుగా మారింది భార‌త జ‌ట్టుకు. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో టీమిండియా బంగ్లాదేశ్ లో కొన‌సాగుతోంది. మూడు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ల‌లో రెండు మ్యాచ్ ల‌లో ఘోర‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. ఆపై వ‌న్డే సీరీస్ కోల్పోయింది. ఇక మిగిలింది ఆఖ‌రి వ‌న్డే. క‌నీసం ఈ మ్యాచ్ లో నైనా విజ‌యం సాధించి పోయిన ప‌రువును కాపాడుతార‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్ర‌ధానంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వాకంపై భ‌గ్గుమంటున్నారు. ఆడేవాళ్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా కేవ‌లం పైర‌వీల ఆధారంగా ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేస్తే ఇలాంటి ఫ‌లితాలు(IND vs BAN 3rd ODI)  వ‌స్తాయ‌ని మాజీ ఆట‌గాళ్లు మండిప‌డుతున్నారు. ఇక మూడో వ‌న్డే మ్యాచ్ శ‌నివారం జ‌ర‌గ‌నుంది.

మొద‌టి వ‌న్డేలో మెహ‌దీ హ‌స‌న్ మ‌జీర్ దుమ్ము రేపాడు. త‌న జ‌ట్టుకు గెలుపు అందించాడు. ఇక రెండో మ్యాచ్ లో హ‌స‌న్ మార‌థాన్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. కేవ‌లం 83 బంతులు ఎదుర్కొని 4 సిక్స‌ర్లు 8 ఫోర్ల‌తో రెచ్చి పోయాడు. ఏడో వికెట్ కు 148 ప‌రుగులు జోడించి రికార్డు బ్రేక్ చేశారు.

ఇక టీమిండియా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ లో తేలి పోయింది. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో క్యాచ్ లు వ‌దిలి వేశారు. ఇక బాగా ఆడుతున్న శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టారు. ధావ‌న్ , కోహ్లీ నిరాశ ప‌రిచారు. జ‌ట్టు ప‌రంగా చూస్తే రోహిత్ శ‌ర్మ కు గాయం కావ‌డంతో ఆడ‌క పోవ‌చ్చు.

అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్ , శిఖ‌ర్ ధావ‌న్ , కోహ్లీ, అయ్య‌ర్, కేఎల్ రాహుల్ , సుంద‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , ఠాకూర్ , దీపక్ చాహ‌ర్ , సిరాజ్, మాలిక్ ఆడ‌తారు.

Also Read : భార‌త్ ప‌రాజ‌యం బీసీసీఐపై ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!