Sonia Gandhi : చెర‌గ‌ని ముద్ర ధీర వ‌నిత ‘సోనియా’

డిసెంబ‌ర్ 9 పుట్టిన రోజు

Sonia Gandhi : గాంధీ కుటుంబంలో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చ‌డ‌మే కాదు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు సోనియా గాంధీ. డిసెంబ‌ర్ 9 ఆమె పుట్టిన రోజు. మ‌రోసారి ఆమెను ప్ర‌స్తావించాల్సి వ‌స్తోంది. భార‌త దేశ రాజ‌కీయాల‌లో ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చినా ఎక్క‌డా వాటి కోసం అర్రులు చాచ‌ని వ్య‌క్తిత్వం ఆమెది.

దూషించిన వాళ్లున్నారు. ద్వేషించిన వాళ్లు లేక పోలేదు. కానీ ప్రేమించే వాళ్లు..అభిమానించే వాళ్లు మాత్రం కోట్ల‌ల్లో ఉన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సోనియా గాంధీ(Sonia Gandhi)  స్థానంలో ఇంకొక‌రు ఎవ‌రైనా మ‌హిళ గ‌నుక ఉండి ఉంటే ఈపాటికి అస్త్ర స‌న్యాసం పుచ్చుకునే వాళ్లు. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునే వాళ్లు.

మొన్న‌టి దాకా ఆమెను విదేశీయురాలు అంటూ ఆరోప‌ణ‌లు గుప్పించిన వాళ్లు బ్రిట‌న్ ప్ర‌ధానిగా ఎన్నికైన ప్ర‌వాస భారతీయుడికి జేజేలు ప‌లుకుతున్నారు. క‌లుషిత‌మైన రాజ‌కీయాల‌లో ఇప్పుడు సోనియా గాంధీ ఒక ఐకాన్ గా నిల‌బ‌డ్డారు. ఆమెను నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు వెంటాడుతూ వుంది.

అయినా ఎక్క‌డా రూల్స్ అతిక్ర‌మించ‌లేదు. తానే స్వ‌యంగా ఈడీ ఆఫీసు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఎక్క‌డా భేష‌జాలు ప్ర‌ద‌ర్శించ లేదు. కానీ త‌న హుందాత‌నాన్ని, నాయ‌క‌త్వాన్ని కాపాడుకుంటూ వ‌చ్చారు సోనియా గాంధీ. తాను ప్రాణ ప్ర‌దంగా ప్రేమించిన భ‌ర్త రాజీవ్ గాంధీని పోగొట్టుకుంది. అండ‌గా ఉంటూ వ‌చ్చిన అత్త ఇందిరా గాంధీని కోల్పోయింది.

కానీ ఎక్క‌డా త‌న క‌న్నీళ్ల‌ను బ‌య‌ట‌కు క‌నిపించ నీయ‌కుండా కుటుంబానికి ఆస‌రాగా నిలిచింది. ధైర్యంగా నిల‌బ‌డ్డ‌ది. ఇది చాలదా త‌ను నిజ‌మైన నాయ‌కురాలు అని చెప్ప‌టానికి. పొద్ద‌స్త‌మానం కులం, మ‌తం, విద్వేషం ఆధారంగా రాజ‌కీయాలు చేసే వాళ్ల‌కు ఆమె ఇట‌లీ దేశ‌స్తురాలిగానే క‌నిపిస్తుంది.

కానీ ఆమె త‌న దేశాన్ని ఏనాడో వ‌దిలేసుకుంది. ఇప్ప‌టికీ వ‌స్త్ర‌ధార‌ణ నిజ‌మైన భార‌తీయురాలిగానే ఉంది. స్వ‌చ్ఛ‌త‌తో కూడిన ప్రేమ‌నే దేశానికి, పార్టీకి, స‌మాజానికి కావాల‌ని కోరుకుంటోంది. గాంధీ కుటుంబం దేశానికి ఎంతో చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే త్యాగానికి ప్ర‌తీక ఆ ఫ్యామిలీ.

ఇవాళ సోనియా గాంధీ లేకుండా పార్టీ మ‌నుగ‌డ సాధించ లేదు. అది వాస్త‌వం..కుటుంబ వార‌స‌త్వం అని విమ‌ర్శించే వాళ్ల‌కు త‌మ పార్టీలో ఎంత మంది వార‌సులు ఉన్నారో గుర్తు చేసుకుంటే బెట‌ర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్ర‌ధాన కార‌ణం సోనియా గాంధీనే(Sonia Gandhi) .

ఆమె గ‌నుక లేక పోతే లేదా ఒప్పుకోక పోయి ఉంటే మాత్రం ఏర్ప‌డి ఉండేది కాదు. ఓ వైపు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క పోయినా , కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వెంటాడుతున్నా మొక్క‌వోని ధైర్యంతో అడుగులు వేస్తున్నారు. అదే చిరున‌వ్వుతో సాగి పోతున్నారు. సోనియా గాంధీ ఆయురారోగ్యంతో జీవించాల‌ని కోరుకుందాం.

Also Read : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ క‌ళ‌క‌ళ‌

Leave A Reply

Your Email Id will not be published!