LIC For Sale : అమ్మకానికి ఎల్ఐసీ రెడీ
కసరత్తు చేస్తున్న కేంద్రం
LIC For Sale : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం గంప గుత్తగా ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టింది. లేదా ప్రైవేటీకరించడంపై ఫోకస్ పెడుతోంది. ఒక రకంగా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలా బహిరంగంగా అమ్మకానికి పెట్టడం దారుణం. డిజిన్వెస్ట్ మెంట్ పేరుతో కేంద్రం అమ్మేందుకు రెడీ అవుతోంది.
గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ ఆదాయ మార్గంలో ఉన్న జీవిత బీమా సంస్థను(LIC For Sale) ప్రైవేట్ పరం చేసేందుకు పావులు కదుపుతోంది మోదీ సర్కార్. ఇదే విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ ఏడాది ఎల్ఐసీలో కొంత శాతం వాటాను విక్రయించింది.
స్టాక్ మార్కెట్ లోకి ఎంటరైంది. కానీ ఆశించిన స్థాయిలో షేరుకు వాల్యూ రాలేదు. దీంతో షేరు విలువ పడిపోవడంతో దానిని సాకుగా చూపించి ప్రైవేట్ రంగం నుంచి సిఇఓను నియమించేందుకు దొడ్డి దారిన ప్రయత్నాలు చేస్తోందన్న విమర్శలు లేక పోలేదు. ఈ సెక్టార్ నుంచి అనుభవం కలిగిన వ్యక్తులను ఎంపిక చేస్తే జీవిత బీమాను గట్టెక్కిస్తారని కుంటి సాకులు చెబుతోంది కేంద్రం.
సిఇఓ పోస్టుకు సంబంధించి ఎంపిక విధి విధానాలు, అర్హతలు, అనుభవం , తదితర వాటిని రూపొందించే పనిలో ఉన్నట్టు టాక్. ఇదే గనుక జరిగితే 66 ఏళ్ల జీవిత బీమా చరిత్రలో తొలిసారి ప్రైవేట్ వ్యక్తికి పగ్గాలు అప్పగించినట్లు అవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగం నుంచి మాత్రమే చైర్మన్ గా ఉంటూ వచ్చారు.
కానీ ప్రైవేట్ వ్యక్తికి అప్పగిస్తే ప్రజలు దాచుకుంటూ వస్తున్న డబ్బులన్నీ మాయం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మెల మెల్లగా ప్రభుత్వ వాటాలను అమ్ముకుంటూ చివరకు ప్రైవేట్ పరం చేయడమే కేంద్రం లక్ష్యంగా తోస్తోంది.
Also Read : దైవభూమిలో పని చేయని మోదీ మంత్రం