Congress Himachal Pradesh : 2 వేల కంటే తక్కువ ఓట్లతో 15 సీట్లు
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపు
Congress Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాలు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రజలు తిరస్కరించారు. కేవలం ఆ పార్టీకి 25 సీట్లకే పరిమితం చేశారు. మరో వైపు ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను గెలుచుకుంది. అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది.
ఈ తరుణంలో రాష్ట్రంలోని మొత్తం 68 సీట్లకు గెలుపొందిన కాంగ్రెస్(Congress Himachal Pradesh) అభ్యర్థులలో 2,000 వేల ఓట్ల కంటే తక్కువ ఓట్లు కలిగిన వారు 15 మంది విజయం సాధించడం విశేషం. ఇక కాంగ్రెస్, బీజేపీలకు వరుసగా 40, 25 సీట్లు వచ్చినా ఓట్ల శాతంలో తేడా మాత్రం 0.90 శాతం మాత్రమే. ఇక పార్టీని గెలిపించు కోలేక పోయిన మాజీ సీఎం జైరాం ఠాకూర్ కేవలం 38, 183 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఇదిలా ఉండగా భోరంజ్ , సుజన్ పూర్ , దరాంగ్ , బిలాస్ పూర్ , శ్రీనైనా దేవి, రాంపుర్ , షిల్లై , శ్రీ రేణుకాజీలలో రెండు పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్యలో 1,000 ఓట్ల లోపు తేడా వచ్చింది. ఇక భట్టియాత్ , బల్హ్ , ఉనా , జస్వాన్ , ప్రాగ్ పూర్ , లాహౌల్ , స్పితి, సర్కాఘట్, నహాన్ లలో 1,000 నుండి 2,000 మధ్య మాత్రమే వ్యత్యాసం ఉంది.
అత్యధిక మెజారిటీ జైరామ్ ఠాకూర్ దే కావడం విశేషం. ఆయన తర్వాత బీజేపీకి చెందిన పవన్ కాజల్ కాంగ్రాలో 19,834 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రిజర్వ్ డ్ నియోజకవర్గం రోహ్రూలో కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ లాల్ బ్రాక్తా 19,339 ఓట్ల ఆధిక్యం తో గెలుపొందారు.
భోరంజ్ లో కాంగ్రెస్ కు చెందిన సురేష్ కుమార్ కేవలం 60 ఓట్ల తేడాతో గెలుపొందారు. శ్రీనైనా దేవి స్థానం నుండి బీజేపీ అభ్యర్థి రణధీర్ శర్మ 171 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బిలాస్ పూ్ నుంచి త్రిలోక్ జమ్వాల్ 276 ఓట్లతో గెలుపొందారు.
Also Read : హిమాచల్ ప్రదేశ్ సీఎంపై ఉత్కంఠ