Rana Ayyub : రానా అయ్యూబ్ కు అమెరికా అవార్డు
అత్యున్నత పత్రికా స్వేచ్చ పురస్కారం
Rana Ayyub : భారత దేశానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు రానా అయ్యూబ్ కు అరుదైన పురస్కారం లభించింది. అమెరికా దేశంలో అత్యున్నతమైనదిగా భావించే పత్రికా స్వేచ్ఛ అవార్డు లభించింది. ఇదిలా ఉండగా దేశంలోని వివిధ జైళ్లల్లో మగ్గుతున్న తన సహోద్యోగులకు ఈ పురస్కారాన్ని అంకితం ఇచ్చారు రానా అయ్యూబ్.
ఈ దేశంలో నరేంద్ర మోదీ కొలువు తీరాక కొనసాగుతున్న విధ్వంసాన్ని, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నట్లు ఆమె గత కొంత కాలంగా తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు రానా అయ్యూబ్. ఆమె నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ వచ్చింది.
పత్రికా స్వేచ్ఛకు సంబంధించి అత్యున్నత గౌరవమైన వాషింగ్టన్ డీసీకి సంబంధించిన ప్రెస్ క్లబ్ ద్వారా ఆమె ప్రతిష్టాత్మకమైన జాన్ అబుచోన్ నుండి అందుకున్నారు. ఇదిలా ఉండగా వాషింగ్టన్ పోస్ట్ లో రానా అయ్యూబ్(Rana Ayyub) కాలమిస్ట్ గా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా రిపోర్టింగ్ చేసినందుకు వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా వాషింగ్టన్ పోస్ట్ ఈ ఏడాది ప్రారంభంలో రానా అయ్యూబ్ కు మద్దతుగా పేజీ ప్రకటనను విడుదల చేసింది. భారత దేశంలో స్వేచా పత్రిక దాడిలో ఉందని పేర్కొంది. జూలై 22లో రానా అయ్యూబ్ పేరు ప్రకటిన తర్వాత దేశమంతటా జైళ్లల్లో మగ్గుతున్న తన సహోద్యోగులకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా రానా అయ్యూబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పత్రికా స్వేచ్చ అవార్డును నా సహ ఉద్యోగులు మహమ్మద్ జుబేర్ , సిద్దిక్ కప్పన్ , ఆసిఫ్ సుల్తాన్ లకు అంకింత చేస్తున్నాని చెప్పారు.
Also Read : డింపుల్ యాదవ్ రికార్డ్ విక్టరీ