PAK vs ENG 2nd Test : చెలరేగిన జాక్ లీచ్..జో రూట్
రాణించిన కెప్టెన్ బాబర్ ఆజమ్
PAK vs ENG 2nd Test : పాకిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగుస్తోంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. రెండో రోజు పూర్తిగా బౌలర్లు దాడి ప్రారంభించారు. పాకిస్తాన్ కడపటి వార్తలు అందేసరికి 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. జాక్ లీక్ .. జో రూట్ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. ఆతిథ్య జట్టును కట్టడి చేశారు.
కళ్లు చెదిరే బంతులతో మెస్మరైజ్ చేశారు ఈ ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లు. దీంతో మొదటి టెస్టు మ్యాచ్ లో ఇప్పటికే ఇన్నింగ్స్ 74 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది పాకిస్తాన్ జట్టు. జాక్ లీచ్ , జో రూట్(Joe Root) చెరో ఐదు వికెట్లు పంచుకున్నారు. ఇక పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ సత్తా చాటాడు.
ఇంగ్లండ్(PAK vs ENG 2nd Test) బౌలర్లను అడ్డుకుని 75 పరుగులు చేశాడు. అలీ రాబిన్సన్ అద్భుతమైన బంతికి వెనుదిరిగాడు కెప్టెన్. మరో కీలక ఆటగాడు సౌద్ షకీల్ రాణించాడు. 63 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నిరాశ పరిచాడు. కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.
అంతకు ముందు రెండో రోజు పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులతో ప్రారంభించింది ఆటను. అనంతరం జాక్ లీచ్ , జో రూట్ మైదానంలోకి బంతిని తీసుకున్న తర్వాత సీన్ మారి పోయింది. ఆట పూర్తిగా వారి చేతిలోకి వెళ్లింది. ఒకరి వెంట మరొకరు ఎలాంటి ప్రతిఘటన లేకుండానే పెవిలియన్ బాట పట్టారు.
మరో వైపు ఇంగ్లండ్ జట్టు అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ సత్తా చాటింది. మొత్తంగా మొదటి టెస్ట్ విజయంతో పూర్తి జోష్ లో ఉంది ఇంగ్లండ్ టీం.
Also Read : పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలు ఉండవు