PM Modi MOPA : మోదీ కోసం ‘మోపా’ ప్రారంభానికి సిద్దం

11న గోవాలో ప్రారంభించ‌నున్న పీఎం

PM Modi MOPA : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గోవాలో అత్యంత ఆధునిక సౌకర్యాల‌తో నిర్మించిన మోపా(PM Modi MOPA) ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టును ఈనెల 11న ప్రారంభించ‌నున్నారు.

ఇందుకోసం గోవా ప్ర‌భుత్వం స‌క‌ల ఏర్పాట్లు చేసింది. ఇప్ప‌టికే భ‌ద్ర‌తా సిబ్బంది అక్క‌డ కొలువు తీరింది. ఈ ఎయిర్ పోర్టు మొద‌టి ద‌శ‌లో సంవ‌త్స‌రానికి 4.4 మిలియ‌న్ల ప్ర‌యాణీకుల‌ను చేర‌వేస్తుంది.

మెపాయి ఎయిర్ పోర్టును రూ. 2,870 కోట్ల‌తో అభివృద్ది చేశారు. గోవాలో ఇది మొద‌టి ఎయిర్ పోర్ట్ కాదు రెండో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ లాంఛ‌నంగా మెపా(PM Modi MOPA) ఎయిర్ పోర్టును ఆదివారం ప్రారంభిస్తార‌ని ప్ర‌ధాన‌మంత్రి కేంద్ర కార్యాల‌యం వెల్ల‌డించింది. ఈ మేర‌కు శ‌నివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇదిలా ఉండా భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి అభివృద్ది ప‌ర్చిన ఈ ఎయిర్ పోర్టు వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రి 5 నుంచి కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తుంద‌ని పీఎంఓ వెల్ల‌డించింది.

ఇక అధికారిక ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప్ర‌ధాన‌మంత్రి మోదీ మ‌ధ్యాహ్నం 3.15 గంట‌ల‌కు గోవాలో త‌న మొద‌టి కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తారు. 9వ ప్ర‌పంచ ఆయుర్వేద కాంగ్రెస్ ప్ర‌మాణ స్వీకార స‌మావేశంలో పాల్గొంటారు.

సాయంత్రం 5.15 గంట‌ల‌కు మెపా ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టును ప్రారంభిస్తారు. దేశ‌మంత‌టా ప్ర‌పంచ స్థాయి మౌలిక స‌దుపాయాలు, ర‌వాణా సౌక‌ర్యాల‌ను అందించ‌డం పీఎం ప్ర‌య‌త్న‌మ‌ని పేర్కొంది.

దేశీయ‌, అంత‌ర్జాతీయ గ‌మ్య స్థానాల‌ను క‌లుపుతుంది ఈ ఎయిర్ పోర్ట్. కీల‌క‌మైన లాజిస్టిక్స్ హ‌బ్ గా ప‌ని చేసే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంది. సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ , గ్రీన్ బిల్డింగ్ లు, ర‌న్ వే పై లెడ్ లైట్లు, రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ , అత్యాధునిక టాయిలెట్స్ శుద్ది కర్మాగారం ఉన్నాయి.

Also Read : అమిత్ షాకు ఎన్నిక‌ల సంఘం ఊర‌ట

Leave A Reply

Your Email Id will not be published!