Sukhwinder Singh Sukhu : ఒకప్పుడు మిల్క్ మ్యాన్ నేడు సీఎం
సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రస్థానం
Sukhwinder Singh Sukhu : ఒక్కోసారి కాలం సామాన్యులను కూడా అందలం ఎక్కిస్తుంది. దీనిని అదృష్టం అని కొందరు అంటారు. మరికొందరు కష్టపడితే దక్కిన ఫలితం అని పేర్కొంటారు. వీటన్నింటిని పక్కన పెడితే ఒకటి మాత్రం నిజం. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కింది నుంచి రావాల్సిందే. అడుగులో అడుగులు వేయాల్సిందే.
ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సామాన్యులు కూడా అసమాన్యమైన పదవుల్లో కొలువు తీరడం సాధ్యమేనని నిరూపించారు. ఇది కేవలం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుంది. ఒక రైతు కొడుకు ఇవాళ ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్నారు.
ఓ ఆదివాసీ కుటుంబానికి చెందిన మహిళ రాష్ట్రపతి పదవిలో కొనసాగుతున్నారు. ఒకప్పుడు తండ్రి బస్ కండక్టర్. చాలీ చాలని జీతం. కానీ చదువు కోవాలన్న కోరిక ఎక్కువ. డబ్బుల కోసం తాను పాలు అమ్మాడు. మెల మెల్లగా కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం అత్యున్నతమైన ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యాడు.
ఆయన ఎవరో కాదు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhwinder Singh Sukhu). తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా పార్టీని విజయ పథంలో నడిపించారు. ఏకంగా ఆయన సారథ్యంలోనే పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేలా చేశారు. అంతే కాదు రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ఓటమి పొందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన వ్యూహం ముందు తేలిపోయారు బీజేపీకి చెందిన ముఖ్య నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పలుమార్లు పర్యటించారు. కానీ అధికారంలోకి రావాల్సిన మార్క్ ను చేర్చలేక పోయారు. సుఖు సారథ్యంలో పార్టీ ఏకంగా 68 సీట్లకు గాను 40 సీట్లను కైవసం చేసుకుంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సుఖ్విందర్ సింగ్ సుఖు వైపే మొగ్గు చూపింది. ఆయనను దైవభూమిగా భావించే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా నియమించింది. ఈ సందర్భంగా సుఖు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా గర్వం లేకుండా మాట్లాడారు.
ఆయన గాంధీ ఫ్యామిలీ పట్ల తన విధేయతను చాటుకున్నారు. ఈ స్థాయిలో ఉన్నానంటే అది గాంధీ కుటుంబం వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు సుఖు. కేవలం చదువు కోసం పాలు అమ్మాడు ఇవాళ ఉన్నత స్థానం చేరుకున్నారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం సానుకూల దృక్ఫథాన్ని కలుగ చేస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : సామాన్యుడికి దక్కిన గౌరవం