Morocco VS Portugal : పోర్చుగల్ కు షాక్ సెమీస్ కు మొరాకో
సెమీస్ కు చేరిన అరబ్ జట్టు
Morocco VS Portugal : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆద్యంతమూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలకమైన క్వార్టర్ ఫైనల్ లో బలమైన పోర్చుగల్ ను మొరాకో మట్టి కరిపించింది. సెమీ ఫైనలిస్ట్ గా నిలిచింది. చివరి నాలుగింటిలో చేరిన మొదటి అరబ్ జట్టు కూడా ఇదే కావడం విశేషం.
అల్ తుమామా స్టేడియంలో జరిగిన హోరా హోరీ పోరులో టైటిల్ ఫేవరేట్ గా ఉన్న పోర్చుగల్(Morocco VS Portugal) కు దిమ్మ తిరిగేలా దెబ్బ కొట్టింది. యూసఫ్ ఎన్ నెసిరి తొలి సెషన్ లో 1-0 తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. టోర్నమెంట్ లో తన మొదటి నాకౌట్ దశ గోల్ చేయడంలో విఫలమైన క్రిస్టియానో రొనాల్డో తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్ ను ఆశించినంత మేర ప్రదర్శనతో ఆకట్టు కోలేక పోయాడు.
మొరాకో 42వ నిమిషంలో ఎన్ – నెసిరి హెడర్ ద్వారా ఆధిక్యంలోకి వచ్చింది. విరామం తర్వాత పోర్చుగల్ ఒత్తిడికి గురైంది. నలుగురు ఫస్ట్ ఛాయిస్ డిఫెండర్లలో ముగ్గురు లేకుండానే ఆడారు. మరో వైపు ఒకసారి కెప్టెన్ రొమైన్ సైస్ బలవంతంగా వైదొలిగాడు. అదనపు సమయంలో కేవలం 10 మంది మాత్రమే మిగిలారు.
అయినా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఐదుసార్లు బాలన్ డిఓర్ విజేతగా ఉన్న రొనాల్డో తన జట్టును గట్టెక్కించ లేక పోయాడు. ఖతార్ లో పెనాల్టీలలో బెల్జియం , స్పెయిన్ లపై ఓటమి తర్వాత మొరాకోకు ఇది చిరస్మరణీయమైన విజయంగా చెప్పక తప్పదు. బుధవారం అల్ బేట్ స్టేడియంలో జరిగే సెమీ ఫైనల్స్ లో మొరాకో ఇంగ్లండ్ లేదా స్పెయిన్ తో తలపడనున్నారు.
Also Read : ఫుట్ బాల్ దిగ్గజం రొనాల్డో కన్నీటి పర్యంతం