Abhimanyu Easwaran : అభిమ‌న్యు ఈశ్వ‌రన్ కు టెస్టు ఛాన్స్

బంగ్లాదేశ్ తో ఆడే జ‌ట్టులో చేరిక

Abhimanyu Easwaran : దేశీవాళి క్రికెట్ లో స‌త్తా చాటిన అభిమ‌న్యు ఈశ్వ‌రన్ టెస్టులో ఆడ‌నున్నాడా. అవున‌నే అంటున్నాయి క్రికెట్ వ‌ర్గాలు. బంగ్లాదేశ్ తో జ‌రిగిన రెండు మ్యాచ్ ల రెడ్ బాల్ టూర్ లో ఈశ్వ‌రన్ ఇండియా – ఎ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు. ఇక డిసెంబ‌ర్ 14 నుండి బంగ్లాదేశ్ తో ప్రారంభ‌మ‌య్యే రెండు మ్యాచ్ ల సీరీస్ కోసం చేర‌నున్నాడు.

ఇక వ‌న్డే మ్యాచ్ ఆడుతున్న సంద‌ర్భంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డి స్థానంలో అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్(Abhimanyu Easwaran) ను బీసీసీఐ ఎంపిక చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ 22నన మిర్పూర్ లో జ‌రిగే రెండో టెస్టుకు హిట్ మ్యాన్ అందుబాటులో ఉంటాడ‌ని వైద్యులు సెల‌విచ్చారు.

మూడు వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది భార‌త జ‌ట్టు. మొద‌టి, రెండో వ‌న్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి పాలైంది. మూడో వ‌న్డేలో 272 ప‌రుగుల భారీ స్కోర్ తో ఓడించింది. ఇదిలా ఉండ‌గా బంగ్లా టూర్ లో అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్ స‌త్తా చాటాడు. 141, 157 ర‌న్స్ చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.

కాగా అభిమ‌న్యు ఢాకా ప్రీమియ‌ర్ లీగ్ లో ఆడుతున్నాడు. అత‌డికి అక్క‌డి పిచ్ లు బాగా అల‌వాటైనందు వ‌ల్ల హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఫ‌స్ట్ క్లాస్ ఫార్మాట్ లో 134 ఇన్నింగ్స్ లు ఆడాడు అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్. 45.33 స‌గ‌టుతో అత్య‌ధికంగా 233 ర‌న్స్ చేశాడు.

మొత్తం 5,576 ర‌న్స్ చేశాడు. 2018-19 లో విజ‌య‌వంత‌మైన రంజీ ట్రోఫీ త‌ర్వాత 95.66 స‌గ‌టుతో 861 ప‌రుగులు చేశాడు.

Also Read : టీమిండియా సెన్సేష‌న్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!