Bhupendra Patel Oath : సీఎంగా కొలువు తీరిన భూపేంద్ర పటేల్
మంత్రులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం
Bhupendra Patel Oath : గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ సారి భూపేంద్ర పటేల్(Bhupendra Patel Oath) కొలువు తీరారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కింది బీజేపీ. ఏకంగా 156 స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ.
రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈసారి కేవలం 17 స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. మరో వైపు మొదటిసారిగా ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 5 స్థానాలను గెలుచుకుంది. ఇక అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఎంఐఎం బరిలోకి దిగినా సీట్లు పొందలేక పోయింది.
కానీ కాంగ్రెస్ పార్టీ సీట్లను కోల్పోవడంలో కీలకమైన పాత్ర పోషించాయి ఎంఐఎం, ఆప్ పార్టీలు. ఇదే విషయాన్ని ప్రకటించారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. ఆయన ఈసారి ఎన్నికలకు అన్నీ తానై వ్యవహరించారు.
ఇక గుజరాత్ రాష్ట్రంలో కొలువు తీరిన కేబినెట్ లో మంత్రులుగా హర్ష సంఘవి, జగదీష్ విశ్వ కర్మ, నరేష్ పటేల్ , బచు భాయ్ ఖబద్ , పర్షోత్తమ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi), కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా హాజరయ్యారు.
వీరితో పాటు ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యానాథ్ , కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ , అస్సాం సీఎం బిస్వా శర్మ, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఉత్తరాఖండ్ సీఎం , త్రిపుర సీఎంలు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Also Read : ఎంపీగా డింపుల్ యాదవ్ ప్రమాణ స్వీకారం