CM KCR : బీఆర్ఎస్ కోసం సీఎం హస్తినకు పయనం
నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్
CM KCR : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో సోమవారం సీఎం కేసీఆర్(CM KCR) ఢిల్లీకి తన సతీమణితో కలిసి బయలుదేరి వెళ్లారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా బేగంపేటకు వెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో హస్తినబాట పట్టారు. ఢిల్లీ టూర్ లో భాగంగా నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఫ్యామిలీ అక్కడే ఉండనుంది.
ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ఆఫీసులో రాజ శ్యామల యాగం జరగనుంది. ఈనెల 14న భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన జెండాను ఎగుర వేసి ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కూడా ఇచ్చింది. ఎలాంటి అభ్యంతరాలు లేక పోవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును సర్దార్ పటేల్ మార్గంలో ఏర్పాటు చేశారు. స్వాములు, పండితులు ఈ స్థలాన్ని ఇంతకు ముందు చూశారు.
సీఎం కేసీఆర్ కు నమ్మకాలు ఎక్కువ. ఆయనకు భక్తి కూడా అధికమే. బీఆర్ఎస్ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటి నుంచే ప్లాన్ మొదలు పెట్టారు కేసీఆర్(CM KCR) . మేధావులు, బుద్ది జీవులు, పార్టీ ముఖ్య నేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులతో కూడా సీఎం సమాలోచనలు జరిపారు.
అంతకు ముందు ఆయన చాలాసార్లు ప్రగతి భవన్ లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కూడా సమాలోచనలు జరిపారు. కర్ణాటకలో కుమార స్వామితో కలిసి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటించారు. ఇదే సమయంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కేసీఆర్ వెనుక ఉన్నారు.
Also Read : మోదీ సింహం తట్టుకోవడం కష్టం – బండి