India vs China Comment : చైనా దూకుడుకు చెక్ పెట్టలేమా
డ్రాగన్ దాడులను ఆపలేమా
India vs China Comment : చైనా మరోసారి అంతర్జాతీయ ఒప్పందాన్ని ధిక్కరించింది. ప్రతిసారి దాడులకు తెగబడటం ఆ తర్వాత కాదని పేర్కొనడం అలవాటుగా మారింది. ఇవాళ మరోసారి చైనా గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లి పోయాయి. ఇరు దేశాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చోటు చేసుకున్న ఘర్షణలపై క్లారిటీ ఇవ్వాలంటూ పట్టుపట్టాయి. కేంద్ర హోం శాఖ మంత్రి దీనిని కొట్టి పారేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమ ప్రభుత్వం ఉన్నంత వరకు చైనా కాదు కదా యావత్ ప్రపంచం ఏకమై వచ్చినా భారత దేశంతో పెట్టుకోలేరంటూ ప్రకటించారు.
ఇది పైకి బాగానే ఉన్నా ఎందుకని భారత దేశం చైనాను(India vs China) నిలువరించ లేక పోతోంది. వరల్డ్ లోనే అత్యున్నతమైన ఆయుధ, సైనిక, నేవీ సంపత్తి కలిగి ఉన్న భారత్ ఎందుకని మౌనం వహిస్తోంది.
దీనిపై ప్రతిపక్షాలు లేవదీసిన ప్రశ్నల కంటే ముందు మన దేశీయ విదేశాంగ విధానం చాలా ఉన్నతమైనది. దాని గురించి ముందు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓ వైపు పక్కనే ఉన్న దాయాది పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది.
ఆ దేశానికి తెలుసు భారత్ తో పెట్టుకుంటే తనకు పుట్టగతులు ఉండవని. కానీ వెనుక వైపు నుంచి అస్థిర పరిచేందుకు కావాల్సిన అన్ని పనులను చేసుకుంటూ పోతోంది.
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దాడులకు తెగబడుతోంది. కాశ్మీర్ లో నేటికీ అల్లకల్లోలం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరో వైపు అటు శ్రీలంక ఇటు పాకిస్తాన్ దేశాలకు సాయం పేరుతో అడ్డం పెట్టుకుని డ్రాగన్ చైనా నాటకాలు ఆడుతోంది.
విచిత్రం ఏమిటంటే చైనా ఓ వైపు భారత్ తో స్నేహ పూర్వకమైన స్నేహం కొనసాగిస్తూనే మరో వైపు భారత సరిహద్దులో కొట్లాడుతోంది.
తమ దళాలతో ఘర్షణలకు ఉసి గొల్పుతోంది. మన దేశానికి సంబంధించి యుద్దం మన అభిమతం కాదు. యావత్ ప్రపంచానికి శాంతి సందేశం వినిపిస్తూనే వస్తోంది.
ఉగ్రవాదంపై భారత్ గొంతెత్తి పోరాడుతోంది. ప్రస్తుతం ఐక్య రాజ్య సమితిలో పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాలను ఒంటరిగా చేయాలని కోరుతోంది.ఇదే సమయంలో అటు అమెరికా ఇటు రష్యాతో సత్ సంబంధాలను కొనసాగిస్తోంది.
కానీ చైనా మాత్రం ఎప్పటికీ భారత్ ను మిత్ర దేశంగా పరిగణించడం లేదు. ఆ దేశానికి కూడా తెలుసు..భారత్ తో యుద్దం(India vs China) చేయడం అంటే కోరి తలనొప్పిని తెచ్చు కోవడమేనని.
కానీ డ్రాగన్ పుట్టుకతోనే రాజ్యకాంక్ష అధికం. ఎలాగైనా సరే ఘర్షణకు దిగాలని అనుకుంటోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో రెండు దేశాలు సంయమనం పాటించాయి.
ఇప్పటికే దేశానికి చెందిన అత్యున్నత స్థాయిలో ఉన్న ఆర్మీ, నేవీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు కేంద్ర రక్షణ, హోం శాఖ మంత్రులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ పై రష్యా దాడిని కొనసాగిస్తోంది. ఈ విషయంలో యుద్దం మానేయమంటూ భారత్ కోరింది. కానీ చైనా విషయంలో రష్యా తన వాయిస్ ను వినిపించ లేక పోతోంది.
మొత్తంగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
ఏది ఏమైనా ఒక్క సెంటు భూమి కోల్పోయేందుకు తాము సిద్దంగా లేమన్న అమిత్ షా ప్రకటన సంతోషం కలిగించినా ఆచరణలో భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
చైనా మామూలు దేశం కాదు. ఆర్థిక రంగంలో రాటు దేలి ఉంది., అటు అమెరికాను కూడా వణికిస్తోంది. కాదంటే యుద్దానికి సై అంటోంది. ఓ వైపు జిన్
పింగ్ మరోసారి చీఫ్ గా ఎన్నికయ్యాక ఇలాంటి బెదిరింపులు మరీ ఎక్కువై పోయాయి.
ఏది ఏమైనా ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరొందిన దోవల్ ఉన్నంత వరకు చైనా కానీ లేదా ఇతర దేశాలు ఈ వైపు కన్నెత్తి చూడవనేది వాస్తవం.
Also Read : పార్లమెంట్ దాడిలో అమరులకు నివాళి