IPL 2023 Auction : ఐపీఎల్ సంబురం వేలానికి సిద్దం
మొత్తం వేలం పాటకు 405 ఆటగాళ్లు
IPL 2023 Auction : వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2023 కోసం మినీ వేలానికి సిద్దమైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఐపీఎల్ ప్యానల్ కమిటీ ఈ మేరకు వేలం పాట(IPL 2023 Auction) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. గత ఏడాది బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం జరిగింది.
ఈసారి కేరళ లోని కొచ్చిలో ఐపీఎల్ వేలం పాట జరగనుంది. ఇప్పటికే అధికారికంగా ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లకు సంబంధించి ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి అందజేశాయి. దీంతో మొత్తంగా వేలం పాటకు మొత్తం 405 మంది ఆటగాళ్లు అందబాటులో ఉన్నారు.
ఎవరు ఎక్కువ ధర పలుకుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇందులో 991 మంది ఆటగాళ్ల నుంచి 87 స్లాట్స్ కోసం 405 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్టు చేసింది బీసీసీఐ ఐపీఎల్ నిర్వాహక కమిటీ.
ఇందులో భారత దేశానికి చెందిన ఆటగాళ్లు 273 మంది ఉండగా 132 మంది విదేశాలకు చెందిన క్రికెటర్లు ఉన్నారు. ఇందులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. బెన్ స్టోక్స్ , కామెరూన్ ఎక్కువ రేటు పలికే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఇద్దరి ప్రారంభ (బేస్ ) ధర రూ. 2 కోట్లు ఉంది. దాదాపు ఈ ఇద్దరు రూ. 15 కోట్ల నుంచి రూ. 17 కోట్లు దాకా వెచ్చించే ఛాన్స్ ఉందని అంచనా. ఇక వేలం పాట ఈనెల 23న కొనసాగుతుంది. ఇక జట్ల పరంగా చూస్తే పర్స్ ఎంత ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. కోల్ కతా నైట్ రైడర్స్ వద్ద కేవలం రూ. 7.2 కోట్లు మాత్రమే ఉన్నాయి.
సన్ రైజర్స్ వద్ద రూ. 42.25 కోట్లు, పంజాబ్ కింగ్స్ వద్ద రూ. 32.20 కోట్లు, చెన్నై కింగ్స్ వద్ద రూ. 20.45 కోట్లు, లక్నో వద్ద రూ. 23.35 కోట్లు, ముంబై వద్ద రూ. 20.55 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 19.45 కోట్లు, గుజరాత్ వద్ద రూ. 19.25 కోట్లు ఉన్నాయి.
Also Read : బ్యాటింగ్ ఎంచుకున్న భారత్