Lionel Messi Retire : ఫుట్ బాల్ కు లియోనెల్ మెస్సీ గుడ్ బై

అత్య‌ధిక గోల్స్ చేసిన ఆట‌గాడిగా గుర్తింపు

Lionel Messi Retire : కోట్లాది మంది అభిమానుల‌కు చేదు వార్త చెప్ప‌నున్నాడా ఫుట్ బాల్ దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ. ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ -2022లో అర్జెంటీనా జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఫుట్ బాల్ క్రీడా రంగం నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న జ‌ట్టును ఫైన‌ల్ వ‌ర‌కు చేర్చాడు.

ఇక ఫ్రాన్స్ , మొరాకో జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే రెండో సెమీ ఫైన‌ల్ లో ఏ జ‌ట్టు గెలిస్తే ఆ టీమ్ తో అర్జెంటీనా ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఫుట్ బాల్ చ‌రిత్ర‌లో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు మెస్సీ. ఈ ఫైన‌ల్ మ్యాచ్ త‌న‌కు చివ‌రి మ్యాచ్ కానుంద‌ని ధ్రువీక‌రించాడు ఫుట్ బాల్ దిగ్గ‌జం. క్రొయేషియాతో జ‌రిగిన సెమీస్ లో 3-0 తేడాతో క్రొయేషియాపై ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

అల్బారెజ్ రెండు గోల్స్ సాధిస్తే మెస్సీ క‌ళ్లు చెదిరే గోల్ తో ఆక‌ట్టుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు గోల్స్ చేశాడు మెస్సీ. ప్ర‌పంచ క‌ప్ ల‌లో అర్జెంటీనా త‌ర‌పున అత్య‌ధిక గోల్స్ చేసిన ఆట‌గాడిగా ఉన్న బాటిస్టుటా ను అధిగ‌మించాడు. అత‌డి పేరుతో 10 గోల్స్ ఉన్నాయి. మెస్సీకి ఇప్పుడు 35 ఏళ్లు.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌లో 11 గోల్స్ చేసి త‌న పేరును లిఖించేలా చేసుకున్నాడు. ఇదే నాకు త‌గిన అవ‌కాశం. నా కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. ఇదే త‌గిన స‌మ‌యం. నేను నా ప్ర‌యాణం ముగించేందుకు అని స్ప‌ష్టం చేశాడు మెస్సీ(Lionel Messi Retire).

అత‌డు లేని ఆట‌ను ఊహించ‌లేమ‌ని వాపోతున్నారు క్రీడాభిమానులు. ప్ర‌పంచ ఫుట్ బాల్ చ‌రిత్ర‌లో డిగో మార‌డోనా త‌ర్వాత అర్జెంటీనాలో అంత‌టి ప్రాముఖ్య‌త క‌లిగిన ఫుట్ బాల‌ర్ గా మెస్సీ నిలిచాడు.

Also Read : అల్వారెజ్ బ‌హుమానం మెస్సీ ఆనందం

Leave A Reply

Your Email Id will not be published!