Bilkis Bano : బిల్కిస్ బానో కేసుపై కీలక కామెంట్స్
పదే పదే ప్రస్తావించకండి - సీజేఐ
Bilkis Bano : తనపై అత్యాచారానికి పాల్పడి జీవిత ఖైదుకు గురైన దోషులు 11 మందిని గుజరాత్ సర్కార్ విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో(Bilkis Bano) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనంలో ఒకరైన న్యాయమూర్తి బేలా త్రివేది ఉన్నట్టుండి తప్పుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
బుధవారం మరోసారి ఈ కేసుకు సంబంధించి జాబితా చేయాలని బిల్కిస్ బానో తరపు న్యాయవాది కోరారు. పదే పదే ప్రస్తావించకండి అంటూ న్యాయమూర్తులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి దనంజయ వై చంద్రచూడ్ , జస్టిస్ పీఎస్ నరసింహల ముందు ఈ అభ్యర్థనను మరోసారి లేవనెత్తారు.
జస్టిస్ బేలా త్రివేది నిరాకించిన తర్వాత తాజా బెంచ్ ను ఏర్పాటు చేయడాన్ని త్వరగా పరిశీలించాలని న్యాయవాది కోరారు. బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కొత్త బెంచ్ ను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనపై తీవ్రంగా స్పందించింది. పిటిషన్ జాబితా చేస్తాం.
దయచేసి ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించద్దని సూచించారు ప్రధాన న్యాయూమర్తి. ఇదిలా ఉండగా బిల్కిస్ బానో(Bilkis Bano) కేసులో దోషుల ప్రవర్తన బాగుందంటూ కేంద్రం సపోర్ట్ తో గుజరాత్ సర్కార్ వారిని విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 15న ఖైదీలను విడుదల చేసింది. ఆపై బయటకు వచ్చిన వారికి పూలమాలలతో స్వాగతం పలికారు. ఆపై వారికి స్వీట్లు తినిపించారు. రేపిస్టులను ఎలా విడుదల చేస్తారంటూ పెద్ద ఎత్తున మహిళలు, మేధావులు ప్రశ్నించారు. దీనిని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది.
Also Read : భారత రాష్ట్ర సమితి ఆఫీసు ప్రారంభం