Morocco Fans Clash : మొరాకో అప‌జ‌యం ఫ్యాన్స్ వీరంగం

దేశ‌మంత‌టా అల్ల‌ర్లు, విధ్వంసాలు

Morocco Fans Clash : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిపా వ‌ర‌ల్డ్ క‌ప్ -2022 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. మొద‌టి సెమీ ఫైన‌ల్ లో మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా క్రొయేషియాపై 3-0 తేడాతో ఓడించి ఫైన‌ల్ కు చేరుకుంది. ఇక బుధ‌వారం అర్ధ‌రాత్రి జ‌రిగిన రెండో సెమీ ఫైన‌ల్ లో ఫ్రాన్స్ 2-0 తేడాతో మొరాకోను మ‌ట్టి క‌రిపించింది.

దీంతో ఫ్రాన్స్ లో సంబురాలు మిన్నంట‌గా మొరాకోలో మాత్రం అభిమానులు రెచ్చి పోయారు. వీరంగం సృష్టించారు. వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దాడుల‌కు దిగారు. టోర్నీలో ఎలాంటి అంచ‌నాలు లేకుండానే బ‌రిలోకి దిగిన మొరాకో ఊహించ‌ని స్థాయిలో కీల‌క జ‌ట్ల‌కు షాక్ ఇచ్చింది.

ఏకంగా సెమీ ఫైన‌ల్ కు చేరింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఫ్రాన్స్ ధాటికి నిలువ‌లేక పోయింది. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించ‌డంలో సిద్ద‌హ‌స్తులైన ఫ్రాన్స్ ఆట‌గాళ్ల అటాకింగ్ కు చేతులెత్తేసింది మొరాకో. దీంతో ఫ్రాన్స్ చేతిలో ఓట‌మి త‌ట్టుకోలేక ఫ్యాన్స్ ఆగ్ర‌హంతో(Morocco Fans Clash)  ఊగి పోయారు. మ్యాచ్ ముగిసిన వెంట‌నే బ్ర‌స్సెల్స్ వీధుల్లో ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తించారు.

చెత్త డ‌బ్బాల‌ను, కార్డ్ బోర్డుల‌ను త‌గుల బెట్టారు. పోలీసుల‌పై దాడి చేసేందుకు య‌త్నించారు. ప‌టాకులతో పాటు చేతికి వ‌చ్చిన వ‌స్తువుల‌ను విసిరేశారు. చివ‌ర‌కు ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డం, కంట్రోల్ త‌ప్ప‌డంతో పోలీసులు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించాల్సి ఉంది.

ఎంత‌కూ వినిపించుకోక పోవ‌డంతో వాట‌ర్ క్యాన‌న్ల‌ను ఉప‌యోగించారు. అభిమానుల‌ను చెద‌ర‌గొట్టారు పోలీసులు. ఇదిలా ఉండ‌గా తాము బాగానే ఆడామ‌ని, గెలుపు త‌మ చేతుల్లో లేద‌ని పేర్కొన్నాడు మొరాకో కెప్టెన్.

Also Read : జ‌ర్న‌లిస్ట్ ఉద్విగ్నం మెస్సీ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!