IND vs BAN 1st Test 2022 : శుభ్ మన్..పుజారా సెంచరీల మోత
258 రన్స్ కు డిక్లేర్ చేసిన భారత్
IND vs BAN 1st Test 2022 : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పూర్తి పట్టు సాధించింది. భారత బౌలర్లు సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150 రన్స్ కు చాప చుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియా దుమ్ము రేపింది. కేవలం 2 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది.
ఈ తరుణంలో భారత జట్టు కెప్టెన్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 404 పరుగులకు ఆలౌట్ అయిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 258 రన్స్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టుపై 512 రన్స్ ఆధిక్యంలో(IND vs BAN 1st Test 2022) నిలిచింది. ఇదిలా ఉండగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఛతేశ్వర్ పుజారా 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యింది.
రెండో ఇన్నింగ్స్ లో ఆ పొరపాటు చేయలేదు వైస్ కెప్టెన్. 130 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఛతేశ్వర్ 14 ఫోర్లతో సెంచరీ చేశాడు. 52 ఇన్నింగ్స్ ల అనంతరం శతకం చేయడం విశేషం. ఇక ఇన్నింగ్స్ ముగిసే సమయానికి పుజారా , కోహ్లీ నాటౌట్ గా నిలిచారు. అంతకు ముందు ఓపెనర్ శుభమ్ మన్ గిల్ అద్భుతంగా ఆడాడు.
దూకుడు పెంచాడు. 110 పరుగులు చేశాడు. ఈ తరుణంలో అనవసరమైన షాట్ కొట్టేందుకు వెళ్లి వెనుదిరిగాడు. ఇక స్టాండ్ బై కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో కూడా నిరాశ పరిచాడు. కేవలం 23 పరుగులే చేసి ఇక చాలు అన్నట్టు పెవిలియన్ బాట పట్టాడు.
అంతకు ముందు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, ఉమేష్ యాదవ్ 1 , అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.
Also Read : గాయం నిజమేనా మెస్సీ ఆడేనా