Mahua Moitra Comment : దేశంలో అసలు ‘పప్పు’ ఎవరు
మహూవా సంచలనం
Mahua Moitra Comment : పప్పు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ దద్దరిల్లింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశాన్ని ఎలా సర్వ నాశనం చేస్తుందో ఆధారాలతో సహా బయట పెట్టారు.
అంతే కాదు అంకెలతో సహా బండారాన్ని బట్ట బయలు చేశారు. మహూవా మోయిత్రా(Mahua Moitra) నిప్పుల్లాంటి మాటలతో హోరెత్తించారు. అంతే కాదు అపరకాళికా అవతారం ఎత్తారు.
ఒక రకంగా ప్రజా ప్రతినిధురాలిగా, దేశ పౌరురాలిగా తన బాధ్యత ఏమిటో చెప్పకనే చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రశ్నించడం నేరంగా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వైపు ద్రవ్యోల్బణం, ఇంకో వైపు నిరుద్యోగం పట్టి పీడిస్తుంటే ప్రభుత్వం మాత్రం కుంటి సాకులు వెతుకుతోందంటూ నిలదీశారు.
ఇదిలా ఉండగా ఆమె పదే పదే ఇప్పుడు చెప్పండి పప్పు ఎవరో అంటూ నిగ్గదీశారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ గురించి చులకనగా మాట్లాడింది. ఆయనను పదే పదే పప్పు అంటూ ఎద్దేవా చేసింది.
ఇదే నిండు సభలో ఒకరిని అవమానించిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు మహూవా మోయిత్రా. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన మోదీ పప్పు కాదా అని మండిపడ్డారు.
ప్రభుత్వ ఆస్తులను, వ్యవస్థలను నాశనం చేసిన ఘనత ఎవరిదో దేశ ప్రజలకు తెలియదా అని అన్నారు ఎంపీ. ఆమె సంధించిన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి.
దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అసలు ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాల్సింది పోయి బడా బాబులకు, కార్పొరేట్లకు, వ్యాపారవేత్తలకు ఊడిగం చేయడంలోనే నిమగ్నమై పోయిందని ధ్వజమెత్తారు.
బాధ్యతా రాహిత్యంతో ప్రజా సమస్యలను గాలికి వదిలి వేసిన ప్రధాని పప్పు అని ఎందుకు పిలవ కూడదంటూ నిలదీశారు మహూవా మోయిత్రా. సభ్య సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇవాళ దేశం సవాలక్ష అవలక్షణాలతో ఊరేగుతోందన్నారు. ఏ రంగంలో ఏం అభివృద్ది సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మీరు పప్పు అనే పదాన్ని పదే పదే వాడారు. అందుకే నేను దీనిని వాడుతున్నా. దానిని కించ పర్చేందుకు, తీవ్ర అసమర్థతను సూచించేందుకు ఉపయోగిస్తున్నారు.
అయితే అసలు పప్పు ఎవరో మీ గణాంకాలు చెబుతాయంటూ నిప్పులు చెరిగారు మహూవా మోయిత్రా(Mahua Moitra).
పారిశ్రామిక ఉత్పత్తి డేటా, భారతదేశాన్ని నగరు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చే వాదనలు, దేశాన్ని విడిచి పెట్టిన భారతీయుల సంఖ్య, ఆర్థిక వ్యవస్థపై
కేంద్రం వ్యవహరిస్తున్న తీరు , తదితర అంశాలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రస్తుతం మహూవా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది ఎవరు..మోదీనా కాషాయ సర్కారా అన్నది తేలాల్సి ఉంది. ఈ దేశానికి ఇలాంటి ప్రజా
ప్రతినిధులు కావాలని జనం కోరుకుంటున్నారు. మరి మీరేమంటారు.
Also Read : మోదీపై కామెంట్స్ బిలావర్ కు వార్నింగ్