IND vs BAN 2nd Test 2022 : 227 ప‌రుగుల‌కే బంగ్లా ఆలౌట్

రాణించిన భార‌త బౌల‌ర్లు

IND vs BAN 2nd Test 2022 : బంగ్లాదేశ్ తో జ‌రుగుతున్న రెండో టెస్టులో 227 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది బంగ్లాదేశ్ జ‌ట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాకు అంత‌గా క‌లిసి రాలేదు. టీమిండియా బౌల‌ర్లు స‌త్తా చాటడంతో వెంట వెంట‌నే వికెట్లు కూలాయి. ప్ర‌స్తుతం కేఎల్ రాహుల్ , శుభ్ మ‌న్ గిల్ క్రీజులో ఉన్నారు. మొద‌టి రోజు ఇంకా ఆట మిగిలే ఉన్న‌ప్ప‌టికీ బంగ్లాదేశ్(IND vs BAN 2nd Test 2022) త్వ‌ర‌గా వికెట్లు కోల్పోయింది.

దీంతో ఈ టెస్టు కూడా త్వ‌ర‌గా ఫలితం వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ఇక రెండు టెస్టుల సీరీస్ లో భాగంగా మొద‌టి టెస్టులో భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యాన్ని సాధించింది. టెస్టు ఛాంపియ‌న్ షిప్ లో రెండో స్థానానికి చేరుకుంది. భార‌త్ ఏకంగా 55.77 పాయింట్లు సాధించింది. భార‌త బౌల‌ర్ల‌లో ఉమేష్ యాద‌వ్ , ర‌విచంద్ర‌న్ అశ్విన్ స‌త్తా చాటారు.

అద్భుత‌మైన బంతుల‌తో క‌ట్ట‌డి చేశారు బంగ్లా జ‌ట్టును. ఇద్ద‌రూ చెరో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి కీల‌క పాత్ర పోషించారు. ఇక జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ రెండు వికెట్లు తీశాడు. మొద‌టి టెస్టు లో దుమ్ము రేపి, భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన జ‌కీర్ హస‌న్ నిరాశ ప‌రిచాడు. ఇక బంగ్లాదేశ్ జ‌ట్టులో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు మోమినుల్ హ‌క్ .

అత‌డు ఏకంగా 84 ర‌న్స్ చేయ‌డంలో ఆ జ‌ట్టు ఆమాత్రం స్కోరైనా సాధించింది. లేక పోయి ఉండి ఉంటే త‌క్కువ స్కోర్ కే ప‌రిమితం అయ్యేది.

ఇక భార‌త జ‌ట్టు ప‌రంగా చూస్తే శుభ్ మ‌న్ గిల్, రాహుల్, పుజారా, కోహ్లీ, పంత్ , అయ్య‌ర్ , ప‌టేల్ , అశ్విని, ఉనాద్క‌త్ , ఉమేష్ యాద‌వ్ , సిరాజ్ ను తీసుకుంది.

Also Read : ఐపీఎల్ వేలంలో అంద‌రి క‌ళ్లు వీరి పైనే

Leave A Reply

Your Email Id will not be published!